aacharya : ఆచార్య లో రామ్ చరణ్ కి జంటగా రష్మిక కాదు పూజా హెగ్డే ..?
Vedha - January 22, 2021 / 02:09 PM IST

ఆచార్య లో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ నుంచి వస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా కసాండ్ర మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆచార్య సినిమా కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతోంది.

aacharya-pooja-hegde-is-going-to-act-with-ram-charan-in-aacharya
ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఆచార్యలో రాం చరణ్ పాల్గొంటున్న కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇటీవలే చరణ్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు చిరంజీవి – చరణ్ లు ఇద్దరు కలిసి సినిమా మొత్తం కనిపించబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ముందు కేవలం 20 నిముషాలు మాత్రమే చరణ్ పాత్ర ఉంటుందని అన్నప్పటికి ఆ తర్వాత కథ లో కొన్ని మార్పులు చేసి చరణ్ పాత్ర నిడివిని పెంచాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం చరణ్ ఆచార్యలో గంట సేపు కనిపించబోతున్నట్టు సమాచారం. ఒకరకంగా చరణ్ ది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.
aacharya : అందుకే ఆచార్య టీం పూజా హెగ్డే ని సెలెక్ట్ చేసుకున్నారా ..?
అయితే ఇప్పుడు చరణ్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకున్నారని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ముందు ఆచార్య లో చరణ్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తుందని వార్తలు వచ్చాయి. దాదాపు రష్మిక నే ఫైనల్ అని కూడా అన్నారు. కాని ఇప్పుడు పూజా హెగ్డే ఆచార్య ప్రాజెక్ట్ లోకి రాబోతుందని సమాచారం. పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా లక్కీ హీరోయిన్ గా దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తో ఉంది. ఇక చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తే గనక ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. అందుకే మేకర్స్ పూజా హెగ్డే ని తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇది నిజమా లేక మళ్ళీ రూమరా అన్నది త్వరలో క్లారిటీ వస్తే గాని నమ్మడానికి లేదు. .