Allu Arjun : చిరును మళ్లీ మరచిన బన్నీ… ఫ్యాన్స్ సీరియస్
NQ Staff - June 15, 2023 / 07:52 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ పై గత కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ తీవ్రం అసంతృప్తిగా ఉన్నారు. మెగా హీరో అని పిలిపించుకోవడం బన్నీకి ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి నీడ నుండి అతడు బయట పడాలని… చిరంజీవి కాంపౌండ్ హీరో బన్నీ కాదు అంటూ గుర్తింపు దక్కించుకునేందుకు చాలానే కష్టపడ్డాడు.. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు.
తాజాగా అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యింది. ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ను ఏషియన్ సినిమాస్ వారితో కలిసి అల్లు అర్జున్ ఏర్పాటు చేయడం జరిగింది. నేడు లాంచనంగా ఓపెనింగ్ చేశారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో చిరంజీవి కనిపించలేదు.. సరే ఆయన బిజీగా ఉన్నాడేమో అనుకుందాం.. కనీసం లోపల చిరంజీవి ఫోటో లేదు.

AAA Cinemas Multiplex Inaugurated By Allu Arjun
తన ఫోటోలు మరియు హోర్డింగ్ లు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత అల్లు వారి కుటుంబ సభ్యులు అందరి ఫోటోలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా తన భార్యతో ఉన్న ఒక అందమైన ఫ్రేమ్ ను కూడా మల్టీ ప్లెక్స్ లో బన్నీ పెట్టించాడు. కానీ చిరంజీవి ఫోటో మాత్రం మరిచి పోయాడు.
ఆ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ కడుపు రగిలి పోతుంది. ఇదెక్కడి న్యాయం… ఇదెక్కడి పద్దతి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఇప్పటికే మెగా స్టార్ ను చాలా సార్లు అవమానించే విధంగా మాట్లాడాడు.. వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ కూడా చిరును అవమానించాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. బన్నీ సమాధానం చెప్పాల్సిందే.