Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ : సరిగ్గా చెప్పలేక పోయాడు

NQ Staff - September 16, 2022 / 09:39 AM IST

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ : సరిగ్గా చెప్పలేక పోయాడు

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review : సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి భారీగానే పబ్లిసిటీ చేశారు. సినిమా ప్రారంభం అయిన సమయంలోనే టైటిల్‌ తో అందరిని ఆకర్షించారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్‌ సినిమా అవ్వడంతో ఒకింత ఆసక్తిని కలిగించారు. ప్రమోషన్స్ తో కూడా మంచి బజ్ క్రియేట్‌ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

కథ :

కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు నవీన్‌(సుధీర్‌ బాబు) కాగా అలేఖ్య (కృతి శెట్టి) కంటి వైద్యురాలు. సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండని అలేఖ్యని ఒకానొక సమయంలో నవీన్ చూస్తాడు. అప్పుడే ఆమెను తన సినిమాలో నటింపజేయాలని అనుకుంటాడు. అలేఖ్యని మరియు ఆమె కుటుంబ సభ్యులను నవీన్ తన సినిమాకు ఎలా ఒప్పించాడు అనేది కథ. అలేఖ్య కి మరియు ఆమె కుటుంబ సభ్యులకు ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉండదు అనేది ఆసక్తికర విషయం.

నటీనటుల ప్రదర్శన :

సుధీర్‌ బాబు ఒక కమర్షియల్‌ దర్శకుడి పాత్రలో కనిపించి పర్వాలేదు అనిపించాడు. సెకండ్‌ హాఫ్ లోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఈయన నటన బాగుంది. హీరోయిన్ గా కృతి శెట్టి మరో సారి ఆకట్టుకుంది. నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు ప్రతి ఒక్క సీన్‌ లో కూడా అలేఖ్య ని కృతి శెట్టి చూపించింది. కృతి మరియు సుధీర్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

టెక్నికల్‌ :

వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కాస్త అటు ఇటుగా ఉన్నా అతడు అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. సినిమాటోగ్రపీ మరియు ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఆసక్తికర నేపథ్యంను తీసుకోవడం జరిగింది. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ నేపథ్యం

బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌

 

మైనస్ పాయింట్స్ :

కథనంలో పట్టు లేదు

సెకండ్‌ హాఫ్‌ పేలవంగా ఉంది

విశ్లేషణ :

ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా ఒక సింపుల్ డ్రామా కథ. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి రెండు పార్ట్‌ లుగా కథను చూపించాడు. ఒక డాక్టర్ చుట్టూ తిరిగే కథను దర్శకుడు విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే దర్శకుడు ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటూ ఆకట్టుకునే విధంగా ఆమె గురించి చెప్పలేక పోయాడు.

రేటింగ్‌ : 2.0/5.0

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us