Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమాకి వెరైటీ టైటిల్..?

Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి బిబి3 అన్న వర్కింగ్ టైటిల్ తో ప్రచారం చేసుకుంటున్నారు. బిబి3 ఫస్ట్ రోర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. ఖచ్చితంగా బోయపాటి బాలయ్య బాబుకి హ్యాట్రిక్ ఇస్తాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక బాలయ్య అభిమానులు అయితే ఊహించని రేంజ్ లో ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారట.

a-variety-title-for-balakrishna-boyapati-srinu-movie
a-variety-title-for-balakrishna-boyapati-srinu-movie

ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ తో బోయపాటి యమా పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పించబోతున్నాడని ఫస్ట్ రోర్ తో అర్థమైంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ మీద ఒక మాస్ సాంగ్ ని తెరకెక్కించారట. ఈ సాంగ్ సినిమాకి బాగా హైలెట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ద్వారక క్రియేషన్స్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమాకి టైటిల్ ‘టార్చ్ బెర్రర్’..?

కాగా గతకొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పలు టైటిల్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మోనార్క్ అన్న టైటిల్ ఫైనల్ అని చెప్పుకుంటున్నప్పటికీ తాజాగా మరో టైటిల్ వార్తల్లో నిలిచింది. చిత్ర యూనిట్ బిబి3 కి ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గాని మహాశివరాత్రి పండుగ సందర్భంగా టైటిల్ ని ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు రకాల గెటప్స్‌లో కనిపించబోతున్నాడు.

Advertisement
Advertisement