Vijay Devarakonda : ‘లైగర్’ విజయ్ ‘సింగిల్ ప్లేయర్’ అయితే, ఆనంద్ దేవరకొండ ఎవరు.?
NQ Staff - September 13, 2022 / 06:43 PM IST

Vijay Devarakonda : ఎగిరెగిరి పడ్డాడు.. ‘లైగర్’ సినిమాతో పెద్ద దెబ్బ తినేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ‘మా తాత ఎవరో తెల్వద్.. మా నాన్న ఎవరో తెల్వద్ మీకు.. అయినా, నేనంటే మీకెందుకంత అభిమానం.?’ అంటూ ‘లైగర్’ సినిమా ప్రమోషన్ల సమయంలో, సినీ పరిశ్రమలో ‘వారసత్వాన్ని’ పరోక్షంగా ప్రశ్నించాడు విజయ్.
అప్పటినుంచి, విజయ్ మీద ఓ వర్గం నెటిజన్లు స్పెషల్‌గా ఓ కన్నేసి వుంచారు. తాజాగా, ‘సింగిల్ ప్లేయర్’ అని పేర్కొంటూ ఓ ఫొటోని సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు.
నువ్వు సింగిల్ ప్లేయర్ అయితే, మీ తమ్ముడెవరు.?

A Photo Posted By Vijay Devarakonda On Social Media
సింగిల్ ప్లేయర్.. దానర్థం.. ఒకే ఒక్క ఆటగాడు అని.. ఎవరి మద్దతు లేకుండా ఆడుతున్న ఆటగాడని.! విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ కామెంట్‌పై సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు భగ్గుమంటున్నారు.
‘ఆనంద్ దేవరకొండ ఎవరు.? ఆయనిప్పుడు బెంచ్ మీద (క్రికెట్ పరిభాష) వున్నాడా.? నీ టీమ్‌లో రెండో ప్లేయర్‌ని పెట్టుకుని.. ఇదరుల మీద విమర్శలు చేయడమేంటి.?’ అంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.
ఇంతకీ, విజయ్ దేవరకొండ ‘సింగిల్ ప్లేయర్’ పోస్ట్ వెనుక అసలు విషయమేంటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, ఇలాంటి పోస్టుల్ని కావాలనే పెడుతుంటాడు.. కొందర్ని ప్రత్యేకించి టార్గెట్ చేస్తుంటాడు. దాన్ని తన ఆటిట్యూడ్‌గా చెప్పుకుంటుంటాడు కూడా ఈ రౌడీ హీరో. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
Single Player. pic.twitter.com/7SRjZTNQ9Q
— Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2022