Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ షోలో తొలి సారి కోటి రూపాయ‌లు గెలుచుకున్న కంటెస్టెంట్.. !

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టుడిగాను, హోస్ట్‌గాను అద‌ర‌గొడుతున్నాడు. ప్ర‌స్తుతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌కి సినీ సెలెబ్రిటీలు కూడా రావడంతో టీఆర్పీ రేటింగ్ లోను దూసుకుపోతోంది. ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి వచ్చి ఎంటెర్టైన్మెంట్ చేయగా.త్వ‌ర‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు , రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ షోలో కనిపించి సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

A Person One 1 Crore in NTR's Evaru Meelo Koteeswarulu
A Person One 1 Crore in NTR’s Evaru Meelo Koteeswarulu

భారీ అంచనాలతో వచ్చిన ఎన్నో షోలు ప్రజాధరణ దొరకక మధ్యలోనే కనుమరుగైపోయాయి. కానీ, కొన్ని మాత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి వాటిలో క్విజ్ ఆధారంగా ప్రసారం అయ్యే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో ఒకటి. సామాన్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మొదలైన ఈ షో విజయవంతం అయింది.ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు పేరుతో ఎన్టీఆర్ షోని ర‌న్ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ షోకి చాలా మంది కంటెస్టెంట్స్ రావ‌డం, ఎంతో కొంత గెలుచుకోవ‌డం జ‌రిగింది. కాని కోటి రూపాయ‌లు మాత్రం ఎవ‌రు గెలుచుకోలేదు. రీసెంట్‌గా ఓ కంటెస్టెంట్ కోటీ రూపాయ‌లు గెలుచుకున్నాడ‌ని త్వ‌ర‌లో అత‌ని వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి బ్రిటన్ గేమ్ షో అయిన హూ వాంట్స్ టు బి ఎ మిలినియర్ అనే ప్రోగ్రామ్ ఆధారం.

ఎవరు మీలో కోటీశ్వ‌రులు షో సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్.. హాట్ సీట్‌లో ఉన్నకంటెస్టెంట్స్‌కు ప్రశ్నలు అడగటంతో పాటు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు మధ్యలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ కంటెస్టెంట్స్‌తో కలిసి పోతున్నారు.