Mahesh Babu : పోకిరి మేనియా బిగిన్స్: అభిమానుల్ని నిలువు దోపిడీ చేయడానికేనా.?
NQ Staff - August 2, 2022 / 05:19 PM IST

Mahesh Babu : స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆగస్టులో పలువురు స్టార్ హీరోల బర్త్‌డేలు వున్నాయ్. అందులో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే రానుంది.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే. బర్త్ డే కానుకగా, ఆ రోజు సూపర్ స్టార్ అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారట. సూపర్ స్టార్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పోకిరి’ మూవీని ధియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించి ఓ పెద్ద చర్చ నడుస్తోంది.
రీ రిలీజే కానీ..

A new Treat Going Fans Mahesh Babu
ఆల్రెడీ ‘పోకిరి’ సినిమా రికార్డులు కొల్లగొట్టేసింది. ఈ సినిమాని మళ్లీ ధియేటర్లలో రిలీజ్ చేస్తే, అదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో (జనాలు కొత్త సినిమాకే ధియేటర్‌కి రావడం లేదుగా) రీ రిలీజ్ అంటే, ఏ యూజ్ వుంటుంది. కానీ, ఫ్యాన్స్‌ని అదో రకమైన మేనియాలోకి నెట్టేసి, క్యాష్ చేసుకోవాలన్నదే ఇక్కడి టెక్నిక్.
ఇందు కోసం స్పెషల్ టిక్కెట్టు రేట్లు కూడా పెట్టనున్నారట. అవి వున్న రేట్ల కన్నా, ఎక్కువే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, ‘పోకిరి’ సినిమా టీవీల్లో, ఓటీటీల్లో వుంది. ఇంటర్నెట్‌లోనూ ఆల్వేస్ అందుబాటులో వుంది. అలాంటిది, సరికొత్తగా టిక్కెట్టు పెట్టుకుని వెళ్లాలా.?
కానీ, వెర్రి అభిమానం. ఆ అభిమానం ముసుగులో ఎవరి గోల వాళ్లదే. ఏం చేస్తాం. అయితే, నిర్వాహకులు మాత్రం ‘పోకిరి’ సినిమాని యథాతధంగా కాకుండా, టెక్నికల్‌గా కొన్నిమ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేయబోతున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే హై టెక్నీకల్ వేల్యూస్‌తో ధియేటర్‌కి వచ్చిన మహేష్ అభిమానులకు సరికొత్త అనుభూతి కలిగేలా సిద్ధం చేస్తున్నారట. దానికోసం భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారట. అదీ సంగతి.