Avatar-2 : ‘అవతార్-2’ సినిమా చూస్తూ గుండెపోటుతో పెద్దాపురంలో వ్యక్తి మృతి
NQ Staff - December 17, 2022 / 12:17 PM IST

Avatar-2 : జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ‘అవతార్-2’ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగునాట ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేశారు. సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కూడా. వసూళ్ళ జాతర కొనసాగుతోంది.
కాగా, ‘అవతార్-2’ సినిమా తెలుగునాట ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. లక్ష్మీరెడ్డి శ్రీను అనే ఓ వ్యక్తి ‘అవతార్-2’ సినిమా చూస్తూ ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
సినిమా చూస్తూ అపస్మారక స్థితిలోకి…
సినిమా చూస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడనీ, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని బంధువులు తెలిపారు.
ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల గుండె పోటు వచ్చిందా.? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏమైనా ఆయనకు ముందు నుంచి వున్నాయా.? అన్నది తెలియాల్సి వుంది.
కాగా, హర్రర్ సినిమాల విషయంలో ఇలా జరుగుతుంటుంది. భయాన్ని తట్టుకోలేక కొందరు థియేటర్లలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం అనేది తరచూ చూస్తుంటాం.