Nagarjuna : నాగార్జున సినిమా కోసం అన్నపూర్ణలో భారీ సెట్..!

Nagarjuna : నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారు. ఓటీటీలో రిలీజై కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ జోష్‌లోనే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమాకు ఎక్కువ భాగం విదేశాలలో షూటింగ్ జరపాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు.

a huge set in annapurna for nagarjuna movie
a huge set in annapurna for nagarjuna movie

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో నాగార్జున ఏమాత్రం హైదరాబాద్ దాటి బయట లొకేషన్స్ కి వెళ్ళ కూడదని దర్శకుడికి చెప్పాడట. షెడ్యూల్స్ మార్చి అన్నపూర్ణ స్టూడియోలోనే కావలిసిన సెట్స్ వేసి షూటింగ్ చేద్దామని సలహా ఇచ్చినట్టు తాజా సమాచారం. దాంతో దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమాకి సెట్స్ నిర్మించే పనిలో ఉన్నాడట. మేజర్ టాకీపార్ట్ హైదరాబాద్ లో చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

Nagarjuna : నాగ చైతన్య కూడా బంగార్రాజులో నటిస్తున్నట్టు సమాచారం.

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో పాటే సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించబోతున్నాడు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. కాగా నాగ చైతన్య కూడా బంగార్రాజులో నటిస్తున్నట్టు సమాచారం. ఆయనకి జంటగా గ్యాంగ్ లీడర్, శ్రీకారం ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ నటించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.