Nayanatara : నయనతార రెమ్యునరేషన్‌తో రెండు సినిమాలు తీయొచ్చా..?

Nayanatara : నయనతార టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రమోషన్స్‌కి రాకపోయినా కూడా తన డిమాండ్ సౌత్‌లో విపరీతంగా ఉంది. స్టార్ హీరోలతో సమానంగా నయనతార క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పాటు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, ప్రభాస్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

a high remuneration of nayanatara
a high remuneration of nayanatara

తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సహా దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించింది. నయనతార హుందాగా ఉండే పాత్రల్లో అద్భుతంగా నటిస్తుంది. అందుకే ఎక్కువగా సీనియర్ హీరోలకి జంటగా నటించే అవకాశం అందుకుంది. ఇక నయన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లను అందుకున్నాయి. హీరోలకి లక్కీ హీరోయిన్ అనే పేరు కూడా ఉండటంతో ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా తన సత్తా చాటుతోంది. దర్శక, నిర్మాతలే కాదు స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో నయనతార ఉండాలని పట్టుపడుతున్నారు.

Nayanatara : నయనతార అందుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలది దాదాపు సమానం

దాంతో నయన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత అయిదారేళ్ళుగా రెమ్యునరేషన్ పరంగా ఇటు తెలుగులో అటు తమిళంలో హాట్ టాపిక్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఈమె రెమ్యూనరేషన్ ఇప్పుడు 10 కోట్లని మీడియాలో..సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే తన రెమ్యూనరేషన్‌తో రెండు చిన్న సినిమాలు తీయొచ్చు. ఈ బడ్జెట్‌లో తెరకెక్కిన కేరాఫ్ కంచెర పాలెం, పెళ్ళి చూపులు లాంటి సినిమాలు భారీ సక్సెస్ అందుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టాయి. అంతేకాదు నయనతార అందుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలది దాదాపు సమానం అని తెలుస్తోంది.