Sonu Sood: రియ‌ల్ హీరోని క‌లిసేందుకు 1200 కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని

Sonu Sood: రియ‌ల్ హీరోని క‌లిసేందుకు 1200 కి.మీ సైకిల్ తొక్కిన అభిమానివలస కార్మికుల కోసం బస్సులు మరియు రైళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఒంటరిగా ఉన్న అనేక మంది భారతీయ విద్యార్థులు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి ఎంతో సాయం చేశారు సోనూసూద్. సెకండ్ వేవ్ స‌మ‌యంలోను సోనూ చేసిన సేవా కార్య‌క్ర‌మాలు అన్నీ ఇన్నీ కావు.

దేశవ్యాప్తంగా రోగులకు ఆస్పత్రులలో బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర వైద్య సేవలను ఏర్పాటు చేశాడు. ఇక సోను సూద్ తాను చేస్తున్న సహాయ సహకారాలను ఉద్దేశించి మాట్లాడుతూ నటుడిగా 19 సంవత్సరాల కెరీర్ కంటే ఇతరులకు సహాయం చేయడం తనకు ఎక్కువ ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు.

సోనూ చేస్తున్న సాయాల‌కు దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌ని దేవుడిగానే వ‌ర్ణిస్తున్నారు. కొంద‌రు అభిమానులు ఆయ‌న‌ని క‌లిసేందుకు వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొంద‌రు పాద‌యాత్ర చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు సైకిల్‌పై ముంబైకి వ‌స్తున్నారు. ఆ మ‌ధ్య ఓ అభిమాని సోనూసూద్‌ని కలవడానికి హైదరాబాద్ నుండి ముంబై వరకు నడిచి వెళ్లారు. మరొక అభిమాని, సోను సూద్ చిత్రాన్ని, అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు

తాజాగా సోను సూద్ అభిమానులలో ఒకరు ఆయనను కలవటానికి పూరీ నుండి 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసి సోనూసూద్ ని కలిసి తన అభిమానాన్ని వ్యక్తంచేశారు.సోను సూద్ తన అభిమానిని కలిసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో, సింబా అనే పేరున్న అభిమాని సోనూసూద్ కు పూల దండను వేసే ప్రయత్నం చెయ్యగా సోను సూద్ ఆ దండను ఆ అభిమానికే వేశాడు. ఆయనపై ఉన్న తన గౌరవానికి చిహ్నంగా సోను సూద్ పాదాల వద్ద పూలు ఉంచి సోనూసూద్ పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చెయ్యగా వద్దని వారించారు .

అభిమాని సోనూసూద్ పాదాల‌పై పూలు చ‌ల్లి సంతోషం వ్య‌క్తం చేశాడు. అనంత‌రం సోనూసూద్ ఎదురుగా పాట పాడారు. దానికి సోనూసూద్ ఫుల్ ఇంప్రెస్ అయ్యాడు. అయితే తాను చాలా మంది జీవితాలతో కనెక్ట్ అవుతానని అనుకోలేదని కష్టకాలంలో మీతో ఎవరు నిలబడతారో వారే మీకు గొప్ప వ్యక్తి అని తన తల్లి చెప్పేది అని సోనూ సూద్ ఓ సంద‌ర్భంలో పేర్కొన్నారు . నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను, కాని నేను సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ నా తల్లిదండ్రులను చూస్తున్నానని సోనూ సూద్ చెప్పడం గమనార్హం