Prabhas : ప్రభాస్ చేస్తున్న ఆ సినిమాల పరిస్థితి ఏంటి?

NQ Staff - June 17, 2023 / 08:17 PM IST

Prabhas : ప్రభాస్ చేస్తున్న ఆ సినిమాల పరిస్థితి ఏంటి?

Prabhas  : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ఆదిపురుష్ సినిమా ను జనాలు తిరస్కరించారు. దర్శకుడు ఓం రౌత్‌ తీసిన విధానం మరియు ఆయన వినియోగించిన గ్రాఫిక్స్ అన్నీ కూడా పరమ చెత్త అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు.

వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సినిమాకు వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు మూడు వందల నుండి నాలుగు వందల కోట్లు వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దారుణమైన కలెక్షన్స్ ను ఊహించలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలు అయ్యింది. ఒక వేళ ప్రభాస్ సినిమాలు ఇక నుండి బ్యాక్ టు బ్యాక్ వచ్చి అందులో ఒకటి రెండు సక్సెస్‌ అయితే పర్వాలేదు కానీ ఆయన క్రేజ్ పాతాళానికి పడిపోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ ఫలితంతో సంబంధం లేకుండా ఇదే ఏడాది సలార్ సినిమా భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ క్రెడిట్‌ మొత్తం కూడా దర్శకుడు ఓం రౌత్‌ కు వెళ్తుంది. కనుక ప్రభాస్ ఇమేజ్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు.. అంతే కాకుండా ఆయన తదుపరి సినిమాలకు నష్టం ఏమీ లేదు అన్నట్లుగా ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us