39 ఏళ్ల ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిన 85 ఏళ్ల భామ‌.. కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం అన్వేష‌ణ‌

ప్రేమ‌కు కులం, మ‌తం, వ‌య‌స్సు అడ్డు రావ‌ని చాలా సార్లు ప్రూవ్ అయింది. మ‌నిషి జీవిత కాలంలో ఎప్పుడు, ఎవ‌రితోనైన ప్రేమ‌లో ప‌డ‌వ‌చ్చు. 85 ఏళ్ల భామ్మ 39 ఏళ్ల ప్రియుడితో ప్రేమ‌లో ప‌డింది. కొన్నిరోజులు అత‌నితో ఉన్న త‌ర్వాత అత‌డికి బ్రేక‌ప్ చెప్పి కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం అన్వేష‌ణ మొద‌లు పెట్టింది. ఈ భామ్మ పేరు హట్టి రెట్రోజ్ కాగా, న్యూయార్క్‌లో నివ‌సిస్తుంది.

హట్టి రెట్రోజ్ త‌న‌కు తాను చాలా హాట్ అనుకుంటుంది. త‌న‌కున్న త‌క్కువ వ‌య‌స్సు ఉన్న కుర్రాళ్ల‌తో డేటింగ్ చేసేందుకు చాలా ఆస‌క్తి చూపిస్తుంటుంది. 48 ఏళ్ల వ‌య‌స్సులో త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకున్న ఈ భామ డేటింగ్‌ల మీద డేటింగ్‌లు చేస్తుంది. అయితే ప్ర‌స్తుతం ఎవ‌రితో డేట్‌లో లేన‌ని చెప్పిన బామ్మ‌, డేటింగ్ యాప్‌లో త‌గిన జోడి కోసం వెతుకుతున్న‌ట్టు పేర్కొంది.

నా సెక్స్ స్టైల్ నాకెంతో న‌చ్చుతుంది. వ‌య‌స్సు మ‌ళ్లిన పురుషులు త‌క్కువ వ‌య‌స్సు ఉన్న యువ‌తుల‌తో ఎంజాయ్ చేస్తారు. నేను అదే చేస్తున్నాను అంటూ బోల్డ్‌గా సమాధానం ఇచ్చింది. డేటింగ్ చేసేందుకు తనకు 35 ఏళ్ల లోపు యువకులు కావాలని పత్రిక ప్రకటన ఇచ్చి మరీ పార్టనర్‌ కోసం వెతకడం మొదలెట్టింది. ఇక్క‌డ విశేషం ఏమిటంటే ఆమె రిక్వెస్ట్ పెట్టిందో లేదో యువకులు డేటింగ్ చేసేందుకు పోటీప‌డుతున్నార‌ట‌.

వారంలో క‌నీసం మూడుసార్లు కొత్త వ్య‌క్తుల‌తో డేటింగ్ చేసే హట్టి రెట్రోజ్ ఇప్పుడు కొత్త డేటింగ్ యాప్‌ల ద్వారా బాయ్ ఫ్రెండ్ కోసం అన్వేష‌ణ సాగిస్తుంది. పాత యాప్‌లో అంద‌రు ఆమెను తిర‌స్క‌రించ‌డంతో బ్లాక్ చేసింది. య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు డ్యాన్స‌ర్‌గా ఉన్న ఈ భామ్మ ప్రస్తుతం లైఫ్ కోచ్, రచయితగా పనిచేస్తోంది. ఈ బామ్మకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు. లేట్ వ‌య‌స్సులో ఘాటు ప్రేమ‌ను పంచుతున్న ఈ భామ్మ స్టోరీ విని అంద‌రు ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు.