Biggboss 5: ఈ సారి నామినేష‌న్‌లో 8 మంది.. హౌజ్‌మేట్స్ మ‌ధ్య జ‌రిగిన ర‌చ్చ‌

Biggboss 5: బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మం నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ముగ్గురు ఎలిమినేట్ కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో 16 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే తాజాఎపిసోడ్‌లో నామినేషన్స్‌ వాడివేడిగా జరిగాయి. ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్‌ చేసుకున్నారు . అయితే ల‌హ‌రి విష‌యంలో తాను అమ్మ మీద ఒట్టేసి ఎలా అబ‌ద్ధం చెప్పానో అంటూ ర‌వి మ‌ద‌న ప‌డ్డాడు. హ‌మీదా.. శ్రీరామ్‌తో మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంది.

4th week nominations..Heated discussion between Housemates
4th week nominations..Heated discussion between Housemates

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో నాలుగోవారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన బిగ్ బాస్, నామినేట్‌ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్‌ పూల్‌లో వేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. మొదటగా వచ్చిన ప్రియ.. తనతో సరిగా ఉండట్లేదని లోబో, మానస్‌ను నామినేట్‌ చేసింది. విశ్వ.. రవి, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు.

4th week nominations..Heated discussion between Housemates
4th week nominations..Heated discussion between Housemates

లోబో.. నేను లైఫ్‌లో ఒకే ఒక అమ్మాయిని ప్రేమించా. నా లవ్‌ గురించి చెప్తుంటే నువ్వు అది సినిమా స్టోరీలా ఉందన్నావు. ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ ప్రియపై గయ్యిమని అరిచాడు. నీకు అరిచే హ‌క్కు లేదు అని ప్రియ అన‌డంతో లోబో మ‌రింత రెచ్చిపోయాడు. అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో ఇప్పుడు తెలుస్తుంది అని కౌంటరిచ్చింది ప్రియ‌.

జనాలవల్లే తానీ స్టేజీలో ఉన్నానంటూ అరిగిన టేపు రికార్డర్‌లా చెప్పిందే మరోసారి చెప్పాడు లోబో. ఇక అత‌ని బాధ‌ని అర్ధం చేస‌కున్న ర‌వి..లోబోని ఓదార్చాడు. అనంత‌రం కాజ‌ల్ ల‌వ్ స్టోరీ చెబుతున్న స‌మ‌యంలో ఆక‌లి వేస్తుంద‌ని ఎలా అన‌గ‌లిగావు అంటూ సిరిని నామినేట్ చేశాడు. శ్రీరామ్‌.. లాస్ట్‌ వీక్‌ తనను నామినేట్‌ చేసిన శ్వేత, యానీ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు.

షణ్ముఖ్‌.. మీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్‌ ఇవ్వలేదని లోబోను నామినేట్‌ చేశాడు. దీంతో లోబో మరోసారి తను పేదవాడినంటూ ఫ్లూటు వాయించాడు. దీంతో చిర్రెత్తిపోయిన షణ్ను ప్రతిసారి బస్తీ నుంచి, కింది నుంచి వచ్చానని చెప్పొద్దు, అందరం అక్కడి నుంచే వచ్చామంటూ అతడి నోరు మూయించాడు. తర్వాత వచ్చిన కాజల్‌.. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారని నటరాజ్‌ మాస్టర్‌ను, సేఫ్‌ గేమ్‌ ఆడొద్దంటూ సన్నీని నామినేట్‌ చేసింది.

మానస్‌.. నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేయగా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు మాట్లాడినప్పుడు మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండని మానస్‌ హెచ్చరించాడు. అసభ్యకరమైన భాష వాడొద్దని లోబో ఫొటోలో నుంచి ఓ ముక్కను విసిరేశాడు. శ్వేత.. లోబో, రవిని; హమీదా.. లోబో, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశారు. నటరాజ్‌ మాస్టర్‌.. అతిగా నటించకూడదు, నువ్వు వీక్‌ అనిపిస్తోంది అంటూ విశ్వను చిన్నచూపు చూస్తూ నామినేట్‌ చేశాడు.

నువ్వెవరివి నన్ను నటిస్తున్నావని డిసైడ్‌ చేయడానికి అని విశ్వ ఫైర్‌కావడంతో మాస్టర్‌ మీసం మెలేస్తూ మరింత రెచ్చగొట్టాడు. ‘సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదకరమే, అది అడవిలో ఉంటది, ఇది బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటుంది’ అని డైలాగులు వల్లె వేయడంతో కాజల్‌ ఫక్కున నవ్వేసింది. ఇక తనను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయొద్దని హెచ్చరిస్తూ రవిని నామినేట్‌ చేశాడు మాస్టర్‌.

ప్రియాంక సింగ్‌.. సోఫాలో నిలబడ్డప్పుడు మీరు డైరెక్ట్‌గా చేయి పెట్టారు. అది నాకు నచ్చలేదంటూ లోబోను తర్వాత కాజల్‌ను నామినేట్‌ చేసింది. అనంతరం వచ్చిన రవి.. అందరి ముందుకు రావాలంటేనే సిగ్గుగా ఉందని తలదించుకున్నాడు. శనివారం నా జీవితంలోనే వరస్ట్‌ రోజు. నేను ముగ్గురికి.. ప్రియ, లహరి, అమ్మకు సారీ చెప్తున్నాను. ప్రియకు చెప్పిన మాటను చెప్పలేదంటూ అమ్మ మీద ఒట్టేశాను అని బాధతో పశ్చాత్తాపపడ్డాడు.

తనను కొట్టిందంటూ కాజల్‌ను, మీరు గుంటనక్క అని తననే అన్నారంటూ నటరాజ్‌ మాస్టర్‌ను రవి నామినేట్‌ చేశాడు. తర్వాత యానీమాస్టర్‌ తనను నామినేట్‌ చేసిన శ్రీరామ్‌, సిరి ఫొటోల ముక్కలు పూల్‌లో వదిలేసింది. సన్నీ.. తనను పదేపదే సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారన్న ప్రియ, కాజల్‌ను; జెస్సీ.. ప్రియాంక, రవిని నామినేట్‌ చేశారు. మొత్తంగా ఈ నాలుగో వారం నటరాజ్‌, లోబో, రవి, ప్రియ, కాజల్‌, సిరి, సన్నీ, యానీ మాస్టర్‌ నామినేట్ అయ్యారు.వీరిలో ఒక‌రు బిగ్ బాస్ హౌజ్ వీడ‌నున్నారు.