BALA KRISHNA: బాల‌య్య కోసం 75 కోట్లు ఖ‌ర్చు చేయిస్తున్న అనీల్‌.. ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన వార్త‌

వ‌రుస హిట్స్ తో దూసుకెళుతూ టాలీవుడ్‌ టాప్ దర్శకులలో ఒక‌రిగా పేరు గాంచారు అనిల్ రావిపూడి . రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ పొందిన అనీల్ రావిపూడి ఒకటి రెండు కాదు వరసగా ఐదు విజయాలు అందుకున్నాడు. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఈయన దూసుకుపోతున్నాడు. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు భారీ విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చాడు అనిల్ రావిపూడి. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈయన ఊ అనాలే కానీ చాలా మంది నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు. అనిల్ సినిమా అంటే ఇప్పుడు 100 కోట్లు ఖాయం అనే నమ్మకం కూడా వచ్చేసింది నిర్మాతల్లో. సేఫ్ సినిమాలు చేస్తాడనే పేరు కూడా ఉండటంతో అతడి సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్.

ప్రస్తుతం వ‌రుణ్ తేజ్, వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. క‌రోనా వ‌ల‌న ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను కేవలం ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు కరోనాతో బ్రేకులు పడుతున్నాయి. ఈ సినిమాను కూడా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నాడు అనిల్. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. వాళ్లతో పాటు ఎఫ్ 2లో ఎవరెవరు నటించారో అందరూ ఇందులో కూడా కనిపిస్తారని చెప్పాడు అనిల్ రావిపూడి. సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడి సినిమా ఎవరితో ఉండబోతుందనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే దీనికి సమాధానం బాలయ్య అని వినిపిస్తుంది. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి కూడా కన్ఫర్మ్ చేసాడు.

చాలా ఏళ్లుగా బాల‌కృష్ణ‌, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా అంటూ ప్ర‌చారం న‌డుస్తుంది. . రామారావు గారూ అంటూ బాలయ్యతో సినిమా చేయడానికి ఎప్పుడో స్కెచ్ వేశాడు అనీల్ . అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా బాలయ్యతో అవకాశం కోసం చూస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి అఖండతో బిజీగా ఉన్నాడు. ఇక్కడే మరో విశేషం కూడా ఉంది. బాలయ్య సినిమాను షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ఏకంగా 75 కోట్లతో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేసిన అనిల్.. దానికోసం బడ్జెట్ కూడా అలాగే అడుగుతున్నాడు. ఇప్పుడు అఖండ కూడా 60 కోట్లతో తెరకెక్కుతుంది. మొత్తానికి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు బాలయ్య.

Advertisement