Sonu Sood: సోనూసూద్ అంకుల్‌ని కొడ‌తావా, అని టీవీ ప‌గ‌ల‌గొట్టిన బాలుడు

Sonu Sood: క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఎవ‌రి జీవితాలు వారివి, ఎవ‌రి బాగోగులు వారివి. ఒక‌రికి ఒక‌రు అండ ఉండే ప‌రిస్థితి కూడా లేదు. అలాంటి స‌మ‌యంలో నేనున్నానే భ‌రోసా క‌ల్పిస్తూ అడిగిన వారికి సాయం చేసుకుంటూ వెళుతున్న మ‌హోన్న‌త వ్య‌క్తి సోనూసూద్. సినిమాల‌లో విల‌న్ పాత్ర‌లు పోషించిన రియ‌ల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారాడు. సొంత ఖర్చులతో వారి స్వగ్రామానికి పంప‌డం నుండి మొద‌లు పెడితే సీరియ‌స్‌గా ఉన్న వారికి అంబులెన్స్ స‌ర్వీస్ అందించ‌డం వ‌ర‌కు అండ‌గా ఉన్నాడు సోనూ.

Sonu sood
sonu sood

సాయం కోసం సోనూసూద్ ద‌గ్గ‌ర‌కి వేల కొల‌ది రిక్వెస్ట్‌లు వ‌స్తుంటాయి. అలానే సోష‌ల్ మీడియాలోను ఆయ‌న‌ను సాయం కోసం చాలా మంది అభ్య‌ర్ధిస్తుంటారు. వారికి త‌న‌వంతు సాయం చేస్తూ దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా అతడు తన సేవా కార్యక్రమాలను మానలేదు. ఇటీవల కరోనా రెండో దశ దేశాన్ని ఉక్కిరిబిక్కికి చేస్తున్న తరుణంలోనూ సోనూ సూద్ తన సహాయ కార్యక్రమాలను మరింత పెంచాడు.

సెకండ్ వేవ్ లో ఆక్సిజ‌న్‌తో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిసిన ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్ పంపాడు . అలానే నిత్య‌వ‌స‌ర స‌రుకులు కూడా అందించారు. ఆయ‌న సాయం కోరిన వారిలో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల గుండెల‌లో సూనూసూద్ దేవుడిగా కొల‌వబ‌డుతున్నాడు. ఆయ‌న‌కు గుళ్లు క‌ట్టి పూజ‌లు చేస్తున్నారు. మరికొందరు తమ పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుండగా.. మరికొందరు తమ వ్యాపారాలకు సోనూ పేరు పెట్టుకున్నారు.

అయితే పెద్ద వాళ్ల‌కే కాదు చిన్న పిల్ల‌ల‌కు సైతం సోనూసూద్‌పై ఎంత ప్రేమ ఉంద‌నేది తాజాగా ఘ‌ట‌న‌తో అర్ధ‌మైంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలో ఎస్సీ కాలనీకి చెందిన విరాట్ అనే ఏడేళ్ల బాలుడు తన ఇంట్లో టీవీ చూస్తున్నాడు. అందులో తన అభిమాన నటుడు సోనుసూద్ ని హీరో కొట్టే సన్నివేశాన్ని చూశాడు. మా రియ‌ల్ హీరోని కొడ‌తావా అని కోపంతో ర‌గిలిపోయిన బాలుడు బ‌య‌ట నుండి రాయి తెచ్చి సోనూని కొట్టే వారిపై విసిరాడు.

అది టీవీలో స‌న్నివేశం తెలియ‌క ఆ బాలుడి చేసిన పనికి టీవీ బ‌ద్ధ‌లైంది. పెద్ద శబ్ధం రావడంతో ఇంట్లో ఉన్న తన తల్లిదండ్రలు కంగారుగా అతడి వద్దకు వచ్చారు. తన కుమారుడికి ఏమైనా అయిందా అని చూశారు. బాలుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న తల్లి.. పక్కనే టీవీ పగిలి ఉండటాన్ని గమనించింది. ఎందుకు టీవీ పగలకొట్టావ్.. అని అడగ్గా.. సోను సూద్ అంకుల్‌ను కొడితే తాను పడనని గట్టిగా వాదించాడు. ఇందుకు సంబంధించిన పిక్‌ని సోనూ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది.

దీంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. సోనూసూద్ పై ఉన్న అభిమాన్ని ఆ ఏడేళ్ల బాలుడు ఇలా చూపించాడు. దీనికి సంబంధించి ఫొటోను సోనుసూద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.