Trisha : నలభయ్యేళ్ళ కుందనపు బొమ్మ.! త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటంటే.!

NQ Staff - September 26, 2022 / 08:38 AM IST

Trisha : నలభయ్యేళ్ళ కుందనపు బొమ్మ.! త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటంటే.!

Trisha : ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన త్రిష, ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా త్రిష నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. హిందీలో కూడా ఒకటీ అరా సినిమాలు చేసిందీ చెన్నయ్ బ్యూటీ.! త్రిష వయసెంతో తెలుసా.? నలభైకి ఒక్కటి తక్కువ. ఒక్కటంటే ఒక్క సంవత్సరం పూర్తిగా కూడా కాదు.

అంటే, దాదాపుగా నలభైల్లోకి త్రిష ఎంటర్ అయిపోయినట్లే.! త్రిషని చూస్తే, ఆమెకు నలభయ్యేళ్ళంటే ఎవరూ నమ్మరు. ఇంతకీ త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటి.? తరగని గ్లామర్.. త్రిష ఏం చెబుతోందిట.? ‘ఇంతకీ మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి.?’ అని ఎవరైనా అడిగితే, అస్సలేమాత్రం తడుముకోకుండా ‘చెరగని చిరునవ్వే తరగని గ్లామర్ సీక్రెట్’ అని చెప్పేసింది త్రిష.

ఎప్పుడూ కూల్‌గా వుంటుందట. సినిమాల్లో ఛాన్సులు రావడంలేదని అస్సలు దిగాలు పడదట.
‘పొన్నియన్ సెల్వన్’ సినిమా తన కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ అంటున్న త్రిష, అన్నీ అనుకున్నటు జరిగి వుంటే ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ అయి వుండేది. ప్చ్.. ఒకవేళ నటించినా, సినిమాలోంచి ఆమె పాత్రని లేపేసేవార్లెండి. ఎందుకంటే, త్రిష స్థానంలోకి వచ్చిన కాజల్ పాత్రని లేపేశారు కదా.? తెలుగునాట ‘పొన్నియన్ సెల్వన్’ ప్రమోషన్ కోసం త్రిష వచ్చిందిగానీ, ‘ఆచార్య’ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడింది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us