Maa Elections: ప్ర‌కాశ్ రాజ్‌పై పెరుగుతున్న వ్య‌తిరేఖ‌త‌.. పృథ్వీ సంచ‌ల‌న కామెంట్స్

Maa Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను మించిపోయాయి. ఒకరిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్‌ పరస్పర ఆరోపణలు దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా విష్ణు ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న పృథ్వీ ఫోన్‌ కాల్‌ ఆడియో ఇప్పుడు పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని.. కాకపోతే పరిపాలించే అర్హత మాత్రం ఉండదంటూ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి.

30 years Prudhvi Sensational comments on Maa Elections
30 years Prudhvi Sensational comments on Maa Elections

‘‘నాకు వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. నా రాజకీయ ప్రస్థానం మొదలైంది వైజాగ్‌ నుంచే. అయితే, మీరు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ని సన్మానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆయనకు మీరు ఎలా మద్దతు ఇస్తారు? ప్రకాశ్‌రాజ్‌ క్రమశిక్షణ బాలేదని ఫిల్మ్‌ ఛాంబర్‌ అసోసియేషన్‌ ఆయన్ని రెండుసార్లు సస్పెండ్‌ చేసింది.

నేను ఓ కన్నడ సినిమా షూట్‌లో ఉన్నప్పుడు.. ‘కన్నడ వాళ్లు మాత్రమే ఇక్కడ నటించాలి’ అని నాపై ఆయన కేకలు వేశాడు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ మనల్ని మాత్రం పరిపాలించకూడదు. అలాంటిది మీకు ఆయన ఎందుకు అంత నచ్చాడు? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేమిటి? ఏది ఏమైనా నా స్లోగన్‌ ఒక్కటే ‘తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’’ అని పృథ్వీరాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవ‌ల ర‌విబాబు కూడా ప్ర‌కాశ్ రాజ్‌ని విమ‌ర్శించారు. ప్రకాష్ రాజ్ గౌరవంగా సినిమాలు చేసుకోకుండా, ఎన్నికలలో నిలబడం ఎందుకు అన్నారు. పోటీలో నిలబడడం ద్వారా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని ఎందుకు అనిపించుకోవాలి, నేనే ప్రకాష్ రాజ్ అయితే ఎన్నికలలో పోటీ చేయను అన్నారు రవిబాబు.