Nagarjuna and Amala Akkineni: 30 ఏళ్ల అనుబంధం.. వారికి కృతజ్ఞతలు తెలిపిన నాగ్
NQ Staff - June 12, 2022 / 12:11 PM IST

Nagarjuna and Amala Akkineni: అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎలాంటి పాత్ర అయిన వందశాతం న్యాయం చేశాడు. టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఇప్పటికీ తన కుమారులకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నాయి.

30 years of Togetherness for Nagarjuna and Amala Akkineni
నాగ్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆయన ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో నాగచైతన్య పుట్టాక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన తోటి హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. ఇక శ్రీలక్ష్మితో విడాకుల తర్వాత నాగార్జున లవ్ స్టోరీలతో సినిమాలు చేసుకుంటూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగాడు. ఇక నాగార్జున – అమల ప్రేమలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు ? వీళ్లిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు ? ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు ? అన్న ప్రశ్నలకు చాలా రోజుల తర్వాత ఆన్సర్ దొరికింది.
అమలకు కజిన్ బ్రదర్ అయిన సురేష్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అసలు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ధైర్యం కూడా ఎవ్వరికి లేదు. అయితే సురేష్ చక్రవర్తి ఈ సీక్రెట్ చెప్పేశాడు. తాను అమలకు సొంత తమ్ముడిని కాకపోయినా తనను ఆమె తోబుట్టువుగానే చూసుకున్నారని తెలిపాడు. అమల , తాను ఎంతో స్నేహంగా ఉన్నా ఎప్పుడూ వ్యక్తిగత విషయాలు గురించి ప్రస్తావించుకోలేదని కూడా చెప్పాడు.
ఇక పెళ్లికి ముందు అందరిలాగానే నాగార్జున – అమలకు ఏదో ఉందన్న విషయం అందరిలాగానే తనకు కూడా తెలుసు అని.. అయితే తనకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగా నాగార్జునే అమలకు ప్రపోజ్ చేశాడని ఆయన తెలిపారు. ఈ విషయాలను సురేష్ చక్రవర్తి బయట పెడుతూనే సారీ నాగ్ తప్పుంటే క్షమించు అని తెలియజేశాడు. ఏదైతేనేం ఈ జంట జూన్ 11తో వైవాహిక బంధంలో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలో సెలబ్రిటీలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికి నాగార్జున కృతజ్ఞత తెలియజేశారు.ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.