SAMANTHA: సమంత హీరోయిన్‌గా 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా.. కాని ప్లాన్ పూర్తిగా మారింది..!

యాంక‌ర్ ప్ర‌దీప్, అమృత అయ్య‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మున్నా అనే నూత‌న ద‌ర్శ‌కుడు 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మంచి విజ‌యం సాధించింది. బుల్లితెరపై హవా నడిపిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అమృ అయ్య‌ర్‌కు కూడా ఈ సినిమా తొలి చిత్ర‌మే. అయితే ముందుగా ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవకాశం సమంతకు వచ్చిందట. ఈ కథను సమంతకు వినిపించారట డైరెక్టర్ మున్నా. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూవీ షూటింగ్‌కి ముందు జరిగిన గురించిన కొన్ని విషయాలు రివీల్ చేయ‌గా, అవి విని అభిమానులు షాక్ అవుతున్నారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా క‌థ రాసుకున్నాక మున్నా త‌న సినిమాలో హీరోయిన్‌గా స‌మంత‌ని తీసుకోవాల‌ని భావించి ఆమె మేనేజ‌ర్‌ని క‌లిసాడ‌ట‌. సామ్‌కు కథ చెబుతాను అంటే పైనుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుందని ప్రశ్నించాడని, అయితే ముందు ఆ కథను అతనికి చెప్పి మెప్పించాక సమంతకు కలిసే అవకాశం పొందానని అన్నారు మున్నా. అయితే క‌థ‌ను మెచ్చిన స‌మంత డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక త‌న సినిమాలో న‌టించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. అయితే సమంతను హీరోయిన్‌గా అనుకున్నపుడు ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్‌ని ఫైనల్ చేయలేదని ఆయన చెప్పారు. ప్రదీప్ హీరోగా ఒప్పుకున్నాక అమృత అయ్యర్‌ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతను చూసుకుంటూ సినిమా రూపొందించామని మున్నా చెప్పడం విశేషం. ఈ చిత్రంలోని ”నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా” సాంగ్ ఎంత‌గా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.