Tollywood Heroes : ఆ స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాదికి లేనట్టే.. చరిత్రలో ఇదే మొదటిసారి..!

NQ Staff - November 12, 2023 / 12:38 PM IST

Tollywood Heroes : ఆ స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాదికి లేనట్టే.. చరిత్రలో ఇదే మొదటిసారి..!

Tollywood Heroes :

టాలీవుడ్ లో పెద్ద సినిమాలు అంటే అగ్ర హీరోలు రావాల్సిందే. వారి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆడితేనే కాసుల పంట కురుస్తుంది. లేదంటే మాత్రం బాక్సాఫీస్ కు నిరాశ తప్పదు. పరిశ్రమ బాగుండాలి అంటే పెద్ద హీరోల సినిమాలు కచ్చితంగా విడుదల కావాలి వారి సినిమాలు ఏడాదికి ఒకటి అయినా రావాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో సినిమా కోసం ఏకంగా రెండేళ్లు, మూడేళ్లు కూడా తీసుకున్నారు. దాంతో ఆ సినిమాలపై అంచనాలు పీక్స్ కు వెళ్తున్నాయి. దానికి తగ్గట్టుగానే హీరోలు కూడా తమ ప్లాన్ చేంజ్ చేసుకుంటున్నారు.

ఇక తాజాగా 2023లో బడా హీరోలు నలుగురి సినిమాలు లేకుండానే ముగుస్తోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరో కాదండోయ్.. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌. ఈ నలుగురి సినిమాలు ఉంటేనే బాక్సాఫీస్ పీక్స్ కు వెళ్తుంది. లేదంటే మాత్రం ఆ ఇండస్ట్రీని ఎవరూ పట్టించుకోరు. పవన్ కల్యాన్‌ నటించిన బ్రో సినిమా వచ్చినా అది ఆయన పూర్తి స్థాయిలో నటించిన మూవీ కాదు. కమర్షియల్ మూవీ అసలే కాదు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ఆదిపురుష్‌ వచ్చినా అది దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. దాంతో ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు కలకలలాడలేదు.

మహేశ్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా గడిపేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా పుణ్యమా అని జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. ఇక రామ్ చరణ్‌ పరిస్థితి కూడా అంతే. ఆచార్య సినిమాలో ఓ కీలకమైన రోల్ చేశాడు. దాని తర్వాత ఆయన సినిమా మళ్లీ రాలేదు. ఇప్పుడు ఆయన సంచలన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు అల్లు అర్జున్ సంగతి కూడా అంతే. పుష్ప-1 వచ్చి రెండేళ్లు దాటిపోతోంది. కానీ ఇంకా ఆయన నుంచి సినిమా రాలేదు.

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ జరుపుకుంటోంది. దాన్ని 2024లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అసలు స్టార్ హీరోలు అందరూ ఇలా సినిమాలు విడుదల చేయకుండా రెండేళ్లకు ఒక సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వారికి పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చేసింది.

ఏ సినిమా చేసినా భారీ హైప్, క్రేజ్ ఉండేలా చూసుకోవాలి. పైగా అన్ని భాషల అభిమానులకు నచ్చే విధంగా సినిమా చేయాలి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇలాంటి అంచనాలు అన్నీ వారి సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం అవుతున్నాయి. అందుకే ఈ ఏడాది పండగలన్నీ పెద్ద హీరోల సినిమాలు లేక వెల వెల బోయాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us