2018 Movie : కోటిన్నర పెట్టిన సినిమాకు రూ.10 కోట్ల వసూళ్లు
NQ Staff - June 5, 2023 / 10:25 PM IST

2018 Movie : మలయాళంలో కేవలం అయిదు కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన 2018 సినిమా తక్కువ సమయంలో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. మలయాళంలో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న 2018 సినిమాను తెలుగు లో డబ్ చేశారు.
తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కోటి రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. ప్రమోషన్ కార్యక్రమాల కోసం పాతిక నుండి ముప్పై లక్షల వరకు ఖర్చు చేసి ఉంటారు. ఇతర ఖర్చులు అన్నీ కలిపి కూడా మొత్తం కోటిన్నర వరకు అయ్యి ఉంటాయి అనేది టాక్.
2018 సినిమాను బన్నీ వాసు డబ్ చేసి అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేయడం జరిగింది. ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రెడీ అయిన సమయంలో అనూహ్యంగా థియేటర్ లో విడుదల అయిన 2018 సినిమా ఏకంగా పది కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
కోటిన్నర పెట్టుబడి పెట్టిన ఈ సినిమా దాదాపుగా పది కోట్ల వసూళ్లు సాధించింది అంటే ఏ స్థాయిలో సినిమా విజయాన్ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్ సక్సెస్ ఈ మధ్య కాలంలో దక్కలేదు అని చెప్పాలి. బన్నీ వాసు తీసుకు వచ్చిన సినిమా అవ్వడం వల్లే ఈ రేంజ్ విజయం సాధ్యం అయ్యింది.