Chapathis: చ‌పాతీలు ఎంత ప‌ని చేశాయ్.. కంటి చూపు కోల్పోయిన 12 ఏళ్ల బాలుడు

Chapathis: దేన్నైన అమితంగా తీసుకోవ‌డం వ‌ల‌న లేని పోని స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవ‌డం స‌హ‌జం. రుచి బాగుంది క‌దా అని ఏది ప‌డితే అది లాగించేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సిన ప‌రిస్థితి వ‌స్తుంది. 12 ఏళ్ల బాలుడు అతిగా చ‌పాతీలు తిన‌డం వ‌ల‌న కంటి చూపు కోల్పోయాడు. దీంతో వైద్యులు స‌ర్జరీ చేసి తిరిగి చూపు ప్ర‌సాదించారు.

12 Years Boy lost eye Sight After Eating Chapathis
12 Years Boy lost eye Sight After Eating Chapathis

వివ‌రాల‌లోకి వెళితే మధ్యప్రదేశ్‌ శిప్‌పూరి జిల్లా ఖోడ్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్ రోజుకు 40 చపాతీలు తినేవాడు. పెద్ద మొత్తంలో చపాతీలు తినడం వల్ల సందీప్‌లో షుగర్‌ లెవల్స్‌ పెరగడమే కాక మెదడులో చీము చేరింది.ఈ ఎఫెక్ట్ కంటి చూపు కోల్పోయేలా చేసింది. మిగ‌తా అవ‌య‌వాలు కూడా పని చేయ‌డం మానేశాయి. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

వైద్యులు సందీప్‌ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం ప్రతి రోజు సందీప్‌కు 6 యూనిట్ల ఇన్సులిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. సందీప్ షుగ‌ర్ లెవ‌ల్స్ \ 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు వైద్యులు గ‌మ‌నించ‌గా, 12 ఏళ్ల బాలుడికి ఆ రేంజ్‌లో షుగ‌ర్ లెవ‌ల్స్ ఉండ‌డం చూసి వైద్యులే ఖంగు తిన్నారు. షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థితికి వచ్చాక.. కంటి వైద్యుడు సందీప్‌ను పరీక్షించి.. ఆ బాలుడు డయాబెటిక్‌ రెటినోపతితో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు.

సందీప్ కి వెంట‌నే స‌ర్జ‌రీ చేసి వైద్యులు అత‌డికి తిరిగి కంటి చూపు వ‌చ్చేలా చికిత్స చేశారు. ప్ర‌స్తుతం సందీప్ బాగానే చూడ‌గలుగుతున్నాడు.అత‌ని ఆరోగ్యానికి ఎలాంటి ప్ర‌మాదం లేదు. ఈ సంఘ‌ట‌న‌తో అయిన స‌రే ఎవ‌రు కూడా ఏ ఆహారాన్ని అమితంగా తీసుకోవ‌ద్దు అని చెబుత‌న్నారు.