Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేప‌టి నుండి ఏపీలో వంద‌శాతం ఆక్యుపెన్సీతో న‌డ‌వనున్న థియేటర్స్

Andhra Pradesh: గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హారం సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. టిక్కెట్టుపై ఏపీ సర్కార్ తెచ్చిన జీవో అందరిని షాక్‌కి గురి చేసింది. అనూహ్యంగా టిక్కెట్టు ధరల్ని భారీగా తగ్గించేయడంతో ఎగ్జిబిటర్లు ఖంగు తిన్నారు. ఏపీలో తగ్గుదల తెలంగాణ నిర్మాతలు పంపిణీ వర్గాలకు కూడా ఇబ్బందికరం. ఈ ధరలతో కనీస మెయింటెనెన్స్ అయినా కష్టమే అంటూ ఆవేదన చెందారు.

100% occupancy in theaters from 14th Oct(Tomorrow) in Andhra Pradesh.
100% occupancy in theaters from 14th Oct(Tomorrow) in Andhra Pradesh.

క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులుగా ఏపీలోని థియేట‌ర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతోనే న‌డుస్తున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం అక్టోబ‌ర్ 14 నుండి వంద‌శాతం ఆక్యుపెన్సీతో న‌డిపించుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో మహమ్మారి భయాల నడుమ తెలుగు సినిమా పరిశ్రమకు మంచి రోజులు రావాలని కోరుకున్న వారి కలలు ఫ‌లించిన‌ట్టు అని అనిపిస్తుంది.

తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లు జూలై 30 నుండి సినిమాలను ప్రదర్శిస్తున్నా.. 50శాతం ఆక్యుపెన్సీ తో పరిమిత స్క్రీన్ లు మాత్రమే ఓపెనయ్యాయి. నాని- టక్ జగదీష్, నాగ చైతన్య- కమ్ముల లవ్ స్టోరీ, కొండ పొలం, రిప‌బ్లిక్ వంటి చిత్రాల‌కు ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇక ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం త‌ర్వాత చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించ‌నున్నాయి.