TollyWood : ఒకే రోజు ప‌ది సినిమాలు… బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

TollyWood : క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత వ‌రుస సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇన్నాళ్లు ఓటీటీలో సంద‌డి చేసిన సినిమాలు ఇప్పుడు థియేట‌ర్స్ కి క్యూ క‌డుతున్న‌యి. ఇందులో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే ఇటీవ‌ల ప్ర‌తి వారం అర డజను సినిమాల చొప్పున థియేటర్లలోకి వస్తున్నాయి.

10 movies same day in tollywood
10 movies same day in tollywood

ఇప్పటి వరకు వచ్చినవన్నీ చిన్న మీడియం రేంజ్ సినిమాలే. ఈ శుక్రవారం మరో పది చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. మిగతా తొమ్మిది చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అయితే వాటిలో ఏ ఒక్క సినిమాకీ సరైన క్రేజ్ లేకపోవడం గమనార్హం.

10 movies same day in tollywood
10 movies same day in tollywood

తేజ సజ్జా – శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం ‘అద్భుతం’. అప్పుడెప్పుడో పూర్తైన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కాబోతోంది. ఫాంటసీ లవ్ స్టోరీగా కాస్త భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల సినిమా విడుదల అవుతుందన్న విషయం కూడా జనాలకు రీచ్ అవలేదు.

‘కేరింత’ ఫేమ్ పార్వతీశం – శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సావిత్రి వైఫాఫ్ సత్యమూర్తి’ ఈ వారమే థియేటర్లలోకి వస్తోంది. అలానే ‘పీనట్ డైమండ్’ మూవీ ఇప్పుడు ‘రామ్ అసుర్’ గా పేరు మార్చుకొని విడుదల అవుతోంది. వీటితో పాటుగా ‘ఊరికి ఉత్తరాన’ ‘పోస్టర్’ ‘రావణలంక’ ‘మిస్సింగ్’ ‘మిస్టర్ లోన్లీ’ ‘ఛలో ప్రేమిద్దాం’ ‘స్ట్రీట్ లైట్’ వంటి చిత్రాలు కూడా నవంబర్ 19న తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నా ఒక్క దానికి కూడా బజ్ లేదు. డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలుకొని మీడియం రేంజ్ మరియు పెద్ద హీరోల సినిమాల విడుదల ఉండటం.. జనవరిలో భారీ చిత్రాలు వస్తుండటంతో చిన్న సినిమాలకు వచ్చే రెండు నెలల్లో థియేటర్లు దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చిన్న సినిమాలు వ‌రుస‌గా క్యూ క‌డుతున్నాయి.