సింగర్ సునీత పేరుతో రూ.1.7 కోట్లు టోకరా

Advertisement

ప్రముఖ సింగర్ సునీత పేరుతో బారి ఛీటింగ్ జరిగింది. సునీత పేరు చెప్పి ఏకంగా 1.7 కోట్ల రూపాయలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన ఓ మహిళ సింగర్ సునీతకు వీరాభిమాని. అయితే 2019 సంవత్సరంలో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి తాను సునీత మేనల్లుడినని చెప్పాడు. అలాగే సింగర్ సునీత వాట్సాప్‌ నంబర్‌ అని ఒక నంబర్ ఇచ్చాడు. బాధితురాలు రెండు, మూడు సార్లు వాట్సాప్‌ లో సునీతకు మెసేజ్‌ చేయగానే సునీత నంబర్‌ను బ్లాక్ చేసింది. ‌

తరువాత చైతన్య ఇచ్చిన నంబర్‌ నుంచి ఆమెకు సునీత నంబర్ అని చెప్పాడు కనుక ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అంటూ మెసేజ్‌ చేసింది. అంతే అప్పటినుండి బాధితురాలు వలలో పడినంత పని అయ్యింది. కేరళలో ఆనంద చేర్లాయం ట్రస్ట్‌ లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేసింది. అలాగే పలు మాటలు చెప్పి ఏకంగా 1.7 కోట్ల రూపాయలు బాధితురాలి నుండి వసూలు చేశారు. తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ రాగ బాధితురాలికి అనుమానం వచ్చింది. దీనితో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here