‌SAMANTHA : వెబ్ సిరీస్‌కు ముహూర్తం ఖ‌రారు.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన అక్కినేని కోడలు

Samantha RuthPrabhu Angel Images
Samantha RuthPrabhu Angel Images

‌SAMANTHA : ఏ మాయ చేశావే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన స‌మంత ఆ త‌ర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. నాగ చైత‌న్య‌ను వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ పీక్స్‌లోకి చేరింది. ఆమెకు సంబంధించిన ప్ర‌తి మూమెంట్‌ను అభిమానులు ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. స‌మంత కూడా ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంటుంది. అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత ఆలోచ‌న విధానంగా పూర్తిగా మారింది.

ఒక‌ప్పుడు కేవ‌లం సినిమాల‌కే పరిమిత‌మైన ఈ అమ్మ‌డు ఇప్పుడు డిజిటల్ మీడియాపై దృష్టి పెట్టింది. ఓటీటీల‌లో వెబ్ సిరీస్‌ల‌తో పాటు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను హోస్ట్ చేస్తుంది. ఆ మ‌ధ్య ఆహా కోసం సామ్ జామ్ అనే షోను హోస్ట్ చేసింది. ఇందులో ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తూ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు రాబ‌ట్టింది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన ది ఫ్యామిలీ మ్యాన్ అనే పాపులర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్‌లో కీలకపాత్ర పోషించింది. ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇది ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ వ‌చ్చారు. రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించిన ఈ ప్రైడ్ ఇండియన్ సిరీస్ ఫిబ్రవరి 12న హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది అని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు.

కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌ను వాయిదా వేశారు. కొత్త డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కోసం టీం గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. స‌మ్మ‌ర్‌లో సెకండ్ పార్ట్ విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేశారు. మీరంద‌రు ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌నే విష‌యం మాకు తెలుసు.మీరు చూపిస్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు కృత‌జ్ఞులం. ది ఫ్యామిలీ మ్యాన్ 2ను అమెజాన్ ప్రైమ్‌లో సమ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నాం. మీముందుకు వీలైనంత త్వ‌ర‌గా తీసుకొచ్చేందుకు చాలా కృషి చేస్తున్నాం. మీరు సెకండ్ సీజ‌న్‌ను కూడా త‌ప్ప‌క ఆదరిస్తార‌ని మేము న‌మ్ముతున్నాం అని తెలిపారు.

Advertisement