Connect with us

Latest News

దుబ్బాక ఉపఎన్నికలో ఖరారైన తెరాస అభ్యర్థి

Published

on

Share the News from here

తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలయ్యింది. అయితే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మల్సీ ఎన్నికలు, అలాగే దుబ్బాక ఉపఎన్నికలు ఉన్నాయి. అయితే దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణానికి దుబ్బాకలో మల్లి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నిక కోసం తెలంగాణ మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మల్యే స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని తెరాస సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇక బీజేపీ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టింది.

అలాగే కాంగ్రెస్ కూడా దుబ్బాక ఎన్నిక పై ఒక కన్ను వేసింది. ఇది ఇలా ఉంటె తాజాగా తెరాస నుండి అభ్యర్థిని ప్రకటించారు సీఎం కెసిఆర్. ఇక తెరాస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత ను బరిలో నిలిపారు. ఇక రామలింగారెడ్డి మరణ సెంటిమెంట్ ను ఉపయోగించుకోని విజయం సాధించాలని ఆ దిశగా పావులు కదుపుతుంది తెరాస పార్టీ. అలాగే ఆమె గెలుపుకు తెరాస పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలనీ సీఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

సోలిపేట కుటుంబానికి దుబ్బాక ప్రాంత ప్రజల నుండి మంచి సంబంధాలు ఉన్నాయని, అలాగే రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి కారణంగా అక్కడి నుంచి అతడి కుటుంబం ప్రాతినిధ్యం వహించడం సరైన పద్దతేనని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కీలకంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇక ఎలాగైనా దుబ్బాక లో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెరాస పక్క ప్లాన్స్ వేస్తుంది. ఇక బీజేపీ తరుపున రఘునందన్ రావు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాడు. ఇక కాంగ్రెస్ నుండి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడి పేరు వినిపిస్తుంది.

Do NOT follow this link or you will be banned from the site!