Connect with us

Latest News

దుబ్బాకలో ఉప ఎన్నికలు ఎప్పుడో తెలుసా!

Published

on

Share the News from here

దుబ్బాక ఉప ఎన్నికల కోసం తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు ను ఎన్నికల సంఘం వెల్లడించింది.

  • అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్
  • నామినేషన్‌కు అక్టోబర్ 16 చివరి తేదీ
  • అక్టోబర్ 17న స్క్రూటినీ
  • అక్టోబర్ 19 నామినేషన్ల ఉపసంహరణ

-నవంబరు 3న పోలింగ్

  • నవంబర్ 10న కౌంటింగ్

ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల యొక్క ఫలితాలు రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత తెరాస యొక్క పాలనకు సంకేతంగా మారనుంది.

Do NOT follow this link or you will be banned from the site!