Connect with us

Latest News

దుబ్బాక ఉపఎన్నికల పోరులో అభ్యర్థులు వీరే.. !

Published

on

Share the News from here

తెలంగాణ మొత్తం చూపు దుబ్బాక ఉపఎన్నిక మీద ఉంది. అయితే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి అకాల మరణం కారణంగా ఎవ్వరి ఊహించని విధంగా దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక దుబ్బాక స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇక దుబ్బాక ఉప ఎన్నికల అభ్యర్థుల విషయానికి వెళ్తే టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి అభ్యర్థిగా దివంగత రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే రఘునందన్ ‌రావుకు ఆ పార్టీ టికెట్‌ అంటగట్టింది.

ఆయన గతంలో దుబ్బాక నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు బీజేపీ తరఫున పోటీ చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ ‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే అని తెల్సుతుంది. ఇక మొన్నటి వరకు తెరాస లో కొనసాగిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నాడు. ఇక ఈయన పేరును త్వరలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్ గా మారింది. చూడాలి మరి దుబ్బాక ఉప ఎన్నికలో ఎవరు నెగ్గుతారో అనేది.

Do NOT follow this link or you will be banned from the site!