Connect with us

Entertainment

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో చార్జిషీట్.. జాబితాలో 72 మంది

Published

on

Share the News from here

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ వరకు వ్యాపించింది. ఇది వరకు బాలీవుడ్ లో వినిపించిన డ్రగ్స్ వ్యాఖ్యలు తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తుంది. అయితే తాజాగా హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలయింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌.. ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఎక్సైజ్‌ శాఖ సమాధానం ఇచ్చింది. అయితే గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆ 12 కేసుల్లో కేవలం 8 మందిపై మాత్రమే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఇక ఈ జాబితాలో 72 మంది పేర్లు ఉన్నాయి.

అయితే టాలీవుడ్‌ కు సంబంధించిన 4కేసులపై ఎక్సైజ్‌ శాఖ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లండ్‌ల నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్టు ఛార్జ్‌షీట్ ‌లో ఎక్సైజ్‌శాఖ తెలిపింది. అలాగే జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా అయినట్టు అక్కడి నుండి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ వచ్చినట్టు చార్జ్ షీట్ లో వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్ లో డ్రగ్స్ షెడ్లర్లు, స్టూడెంట్స్ పేర్లు నమోదు అయ్యాయి. ఇక టాలీవుడ్ లో ప్రముఖ నటీనటుల పేర్లు ఉన్నాయి. త్వరలో వారిని విచారించనున్నారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!