Jammi Tree : ధనత్రయోదశి, దీపావళి రోజున ఈ పని చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే..
NQ Staff - October 23, 2022 / 02:08 PM IST

Jammi Tree : ధన్తేరస్, దీపావళి సందర్భంగా గ్రహాల రాశుల కలయికలు అందరికీ ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉన్నాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొంది. కార్తీక మాసంలోని త్రయోదశి తిథి అక్టోబర్ 22 సాయంత్రం నుంచి ప్రారంభమైంది అయితే ఈ ఘడియలు అక్టోబర్ 23 వరకు కొనసాగుతాయి. అయితే ఇదే క్రమంలో శని గ్రహం అక్టోబర్ 23న మకరరాశిలోకి సంచరించబోతున్నాడు.
దీని ప్రభావవం అన్ని రాశులపై పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 23 ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావించ వచ్చు. శనికి శమీ మొక్కకు ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. శమీ మొక్క శని దేవునికి చాలా ప్రీతికరమైనది. ధన్తేరస్ రోజు కుబేరునికి శమీ మొక్కలను కూడా సమర్పిస్తారు. అయితే ఈ క్రమంలో జమ్మి చెట్టు నాటడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపున్నారు.
జమ్మి చెట్టుకు హిందూ మత గ్రంథాల్లా చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. జ్యోతిషశాస్త్రంలో ఈ చెట్టు సంపదను ఇచ్చే మొక్కగా పరిగణిస్తారు. అయితే ఈ దీపావళి రోజున ఈ మొక్కను పూజించడం వల్ల అన్ని రకాల ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా లక్ష్మి దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు. శని దేవుని చెడు ప్రభావం కూడా ఈ క్రమంలో సులభంగా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జమ్మి చెట్టును పూజించాలని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
జమ్మి చెట్టుని పూజించడం వల్ల ..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ధంతేరస్ లేదా దీపావళి రోజున జమ్మి చెట్టుని నాటి..ప్రత్యేక పూజలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగొచ్చు. అయితే దీపావళిని పురస్కరించుకుని మంచినీటిని సమర్పించడం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా దూరమవుతుందని నమ్మకం. అంతేకాకుండా మూడు రోజుల పాటు ఈ పూజలు చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కూడా దూరమవుతాయి.