Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక సగం కష్టాలు తొలగి పోయినట్టే..!
NQ Staff - July 14, 2022 / 03:51 PM IST

Tirumala : ఇటీవల టీటీడీ భక్తుల సౌలభ్యం కోసం అనేక విధి విధానాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇకపై తిరుమలలో కూడా యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. భక్తులకు వసతి గదుల కేటాయింపు కౌంటర్లలో ఈ చెల్లింపు విధానం అందుబాటులో ఉంటుంది.
చెల్లింపుల కష్టాలకి చెక్..
ఈ కౌంటర్లలో యూపీఐ చెల్లింపులకు లభించే ఆదరణను బట్టి.. కొండపై అన్ని రకాల సేవల చెల్లింపులకు యూపీఐని అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. కాగా తిరుమల కొండపై అన్ని విషయాలలో యూపీఐ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే అవకతవకలకు అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.

UPI Payments Have Started Tirumala
తిరుమలలో పారదర్శక సేవలు, అవకతవకలకు ఆస్కారం లేని చెల్లింపులే లక్ష్యంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కొండపై ఆయా సేవల చెల్లింపుల విధానాలకు యూపీఐని వర్తింపజేయాలని భావించింది. ఇక రీసెంట్‌గా అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
కరోనా కారణంగా రెండేళ్ల తరువాత.. మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా దర్శనానికి పంపే విధానం కొనసాగనున్నట్టుగా తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేయించేందుకు ప్రయత్నిస్తున్మాని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.