TTD : శ్రీవారి కానుకల లెక్కింపుని ప్రత్యేక్షంగా వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు.. ఏం టెక్నాలజీ వాడనున్నారో తెలుసా?
NQ Staff - March 9, 2022 / 06:56 PM IST

TTD : కరోనా వలన గత రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ క్రమంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంపై కూడా ప్రభావం చూపింది. కరోనా ఆంక్షల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో.. హుండీ ఆదాయం కూడా పడిపోయింది.
ఇప్పుడిప్పుడే హుండీ ఆదాయం పెరుగుతుంది. శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకల లెక్కింపు టీటీడీ టెక్నాలజీని వాడబడుతోంది. అత్యాధునిక పరకామణి భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రానికి ఎదురుగా కొత్త పరకామణి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయబోతోంది. భక్తులు కానుకల లెక్కింపు ప్రత్యక్షంగా వీక్షించేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చనుంది టీటీడీ.
ఇప్పటి దాకా శ్రీవారి ఆలయంలోని గర్భ గుడి వెనుక ప్రాకారంలో ఉన్న పరకామణి కానుకల లెక్కింపు ఇబ్బందిగా మారడంతో టీటీడీ కొత్త ఆలోచనకు తెర తీసింది. కోట్లాది రూపాయల నోట్లు, నాణ్యాలు లెకింపు లో సిబ్బంది ఇబ్బంది పడుతుండటంతో టీటీడీ 10 కోట్ల రూపాయలతో పరకామణి సిద్ధం చేస్తోంది.
భక్తులు సమర్పించే కానుకలతో రోజుకు 9 నుంచి 13సార్లు నిండుతున్న హుండీలోని కానుకలను పరకామణి లెక్కించే సిబ్బంది నోట్లు, నాణేలు, విదేశీ కరెన్సీని వేరు చేసి లెక్కిస్తారు. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజుల్లో మినహా మిగిలిన అన్నీ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీ లెక్కింపు జరుగుతోంది.

TTD technology is being used to count the gifts Presented in the Tirumala Hundi.
టీటీడీ పాలక మండలి పరకామణి సమస్యలను పరిష్కరించేందుకు పరకామణిని ఆలయం బయటకు తీసుకురావాలని నిర్ణయించింది. 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గత ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేసింది టీటీడీ కొత్త పరకామణి ని బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే దాత విరాళంతో నిర్మిస్తోంది.
హుండీ లెక్కింపును భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను పరకామణి భవనానికి అమర్చబునడగా భవనం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనుంది. ఆలయం నుంచి హుండీ గంగాళాలను టవర్ క్రేన్ల సాయంతో వెలపలకు తీసుకొచ్చి బ్యాటరీ వాహనాల ద్వారా కొత్త పరకామణి భవనానికి చేరవేసేలా ప్రణాళికలు రూపొందించింది.