Daily Horoscope: ఆగస్ట్ 17 రాశీ ఫ‌లాలు..ఈ రాశి వారికి ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది..!

NQ Staff - August 17, 2022 / 07:49 AM IST

Daily Horoscope: ఆగస్ట్ 17 రాశీ ఫ‌లాలు..ఈ రాశి వారికి ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది..!
Daily Horoscope

Daily Horoscope

మేషం: ఈ రాశి వారికి నేడు సంతృప్తి క‌రంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది

వృషభం: ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తల పెట్టిన ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి

మిథునం: వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు

కర్కాటకం: ముఖ్యమైన పనుల్లో శ్రద్ద పెంచాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఆలోచనలను దగ్గరకి రానివ్వవద్దు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.

సింహం: నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.

కన్య: వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి విషయంలో వ్యయప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం.

తుల: వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

వృశ్చికం: ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.

ధనుస్సు: కుటుంబకలహాలు దూరమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయంతో ఓ వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది.అపార్ధాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దు. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.

మీనం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.

Read Today's Latest Devotional in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us