Crocodile : దైవత్వం కలిగిన కేరళ శాఖాహార మొసలి.! ఏడు దశాబ్దాలు జీవించి తుది శ్వాస విడిచింది.!
NQ Staff - October 10, 2022 / 05:24 PM IST

Crocodile : మొసలి అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఎందుకంటే అంత డేంజర్ మరి. మొసలి కంట పడ్డామా.? ఇక అంతే సంగతి దానికి ఆహారమైపోవాల్సిందే. కానీ, ఈ మొసలి మాత్రం కేవలం శాఖాహారి. దాన్ని ముట్టుకున్నా, ముద్దు పెట్టినా ఎలాంటి హానీ తలపెట్టదట. అవునా.! అలాంటి మొసళ్లు కూడా వున్నాయా.? వుంది.

This Crocodile Only Eats The Lord Food
ఒకే ఒక్క మొసలి అది. కేరళలోని కాసరగొడ్ అనే ఊరిలో వుంది. కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్‌నో అందరికీ తెలిసిందే. సాక్షాత్తూ ఆ అనంత పద్మనాభస్వామి టెంపుల్‌ని ఈ మొసలి సంరక్షిస్తుంటుందని ఆ ఊరి జనం నమ్ముతుంటారు.

This Crocodile Only Eats The Lord Food
స్వామి వారి ప్రసాదమే ఆహారంగా..

This Crocodile Only Eats The Lord Food
ఈ మొసలికి 70 ఏళ్లు. దీనికో పేరు కూడా వుందండోయ్. బబియా ఈ మొసలి పేరు. అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని అనుకుని వుండే చెరువులో ఈ మొసలి గత కొన్నేళ్లుగా నివాసముంటోంది. మొసలి అంటే సహజంగా మాంసాహారి అనే తెలుసు. కానీ, ఈ మొసలి మాత్రం అచ్చంగా శాఖా హారి. శాఖా హారి అంటే ఆకులూ, అలమలు తినే శాఖాహారి మాత్రమే కాదండోయ్.

This Crocodile Only Eats The Lord Food
కేవలం స్వామి వారి ఆహారం మాత్రమే ఈ మొసలి భుజిస్తుందట. అలా స్వామి వారి ప్రసాదం ఆహారంగా తీసుకునే ఈ మొసలి 70 ఏళ్లు జీవించిందట. మొసలికి ఆహారం అందించేందుకు అర్చకులు ఆ చెరువులోకి దిగి మొసలితో మాట్లాడుతుంటారట. ముద్దులాడుతుంటారట. అయినా ఎవ్వరినీ ఏమీ చేయదట ఆ మొసలి. అప్పుడప్పుడూ ఆ చెరువులోకి దిగిన సాధారణ జనం కంట పడినా ఎవ్వరినీ ఏమీ చేయలేదట ఈ మొసలి. నిజంగా అద్భుతమే కదా. బాధాకరమైన విషయమేంటంటే, ఇటీవలే ఈ మొసలి చనిపోయిందట.
Saddened to hear that Divine Crocodile Babiya which was guarding Sri Anantapura Lake Temple in #Kasaragod of Kerala is no more.!!
Vegetarian Babiya lived in Temple lake for the last 70+ years by eating the Prasadam of Sri Ananthapadmanabha Swamy
Om Shanti? pic.twitter.com/nataU6Jlwa
— Girish Bharadwaj (@Girishvhp) October 10, 2022