Tirumala: శ్రీవారి భ‌క్తుల‌కి గుడ్ న్యూస్.. ఆఫ్ లైన్‌లో స‌ర్వ‌ద‌ర్శనం టిక్కెట్స్ జారీ

NQ Staff - February 15, 2022 / 12:08 PM IST

Tirumala: శ్రీవారి భ‌క్తుల‌కి గుడ్ న్యూస్.. ఆఫ్ లైన్‌లో స‌ర్వ‌ద‌ర్శనం టిక్కెట్స్ జారీ

Tirumala: కరోనా వ‌ల‌న తిరుమ‌ల శ్రీ వారిని ద‌ర్శించాల‌నుకున్న చాలా మంది ప‌లు ఇబ్బందులు ప‌డ్డారు. మొన్న‌టి వ‌ర‌కు ఆన్‌లైన్‌లో టిక్కెట్స్ బుక్ చేసుకొని ద‌ర్శ‌నం చేసుకోవ‌ల‌సి ఉండేది. ఇక ఆఫ్‌లైన్‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టిక్కెట్స్ జారీ చేసుకోవ‌చ్చు. 6 నెలల గ్యాప్‌ తర్వాత ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ చేస్తోంది టీటీడీ.

Sarvadarshanam Tickets released in Tirumala to TTD devotees

Sarvadarshanam Tickets released in Tirumala to TTD devotees

రోజుకు 10వేల టోకెన్స్‌ ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దాంతో, టోకెన్స్‌ కోసం క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. ఇక, రేపట్నుంచి ఉదయాస్తమాన సేవా టికెట్స్‌ను అందుబాటులో ఉంచుతోంది. కోటిన్నర రూపాయలు విరాళమిస్తే శుక్రవారం, కోటి రూపాయలు విరాళమిస్తే మిగతా రోజుల్లో ఉదయాస్తమాన సేవా భాగ్యం కల్పించనుంది టీటీడీ.

ఫిబ్రవరి 16న (బుధవారం) దర్శనం కోసం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, శ్రీగోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టీటీడీ టోకెన్లను జారీ చేస్తోంది. తెల్లవారుజామున నుంచే టికెట్ల కోసం

ఉదయస్తమాన సేవా టికెట్ల బుకింగ్‌కు స్పెషల్ విండో ఏర్పాటు చేశారు. శుక్రవారాల్లో 28 ఉదయస్తమాన సేవా టికెట్లు ఖాళీగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. మిగిలిన రోజుల్లో 503 టికెట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఉదయస్తమాన సేవలను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది టీటీడీ. ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో రూ.5లక్షలు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని టీటీడీ ప్రకటించింది.

ఆఫ్‌లైన్ ద్వారా మిగిలిన మొత్తం చెల్లించని పక్షంలో రూ.5 లక్షలు రీఫండ్ చేయమనుంది. కాగా, ఒకరికి ఒక టికెట్లు మాత్రమే కేటాయిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.ఈ ఉదయస్తమాన సేవా టికెట్టు కింద వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్ల పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవ కల్పించనున్నారు. అదే సంస్థలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ పేర్కొంది.

Sarvadarshanam Tickets released in Tirumala to TTD devotees

Sarvadarshanam Tickets released in Tirumala to TTD devotees

శని, ఆది, సోమవారాల్లో ఉదయస్తమాన సేవ భక్తులకు సుప్రభాతం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మంగళ, బుధ, గురువారాల్లో టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన (మంగళవారం), తిరుప్పావడ సేవ(గురువారం), కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుక్రవారాల్లో ఉదయస్తమాన సేవా టికెట్లు కలిగిన భక్తులకు సుప్రభాతం, అభిషేకం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Read Today's Latest Devotional in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us