Rudraksha : రుద్రాక్షలను అల్లాటప్పాగా ధరిస్తే అంతే సంగతులు
NQ Staff - December 5, 2022 / 12:22 PM IST

Rudraksha : ఈ మధ్య కాలంలో కొందరు ఫ్యాషన్ కోసం కూడా మెడలో రుద్రాక్ష మాలను ధరిస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ పెద్దలు హిందూ ధర్మ పండితులు చెప్తున్నారు. రుద్రాక్ష మాల ధరించిన వారు కచ్చితంగా నియమా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
మెడలో రుద్రాక్ష మాల ఉన్నప్పుడు మనిషి స్వచ్ఛంగా శుద్దిగా ఉండాలి. రుద్రాక్ష ఆ పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతూ ఉంటారు. శివునికి ప్రతి రూపంగా కూడా రుద్రాక్ష మాలను భావిస్తుంటారు.
అలాంటి రుద్రాక్ష మాల ధరించిన సమయంలో ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ముఖ్యంగా రుద్రాక్ష మాల ధరించిన సమయంలో మాంసాహారాలను భుజించకూడదు. అంతే కాకుండా తప్పుడు పనులు చేస్తూ మాలను అవమానించ కూడదు.
శృంగార సమయంలో మరియు కుటుంబం లో ఎవరైనా చనిపోయి మైల వచ్చిన సమయంలో కూడా మెడలో రుద్రాక్ష మాలను ధరించి ఉండ కూడదు. ఇక రుద్రాక్ష మాల పడుకునే సమయంలో తప్పనిసరిగా తీసి పక్కన ఉంచి పడుకోవాలి.
నిద్రలేచిన తర్వాత స్నానం పూజ చేసుకొని ఆ తర్వాత మెడలో రుద్రాక్ష వేసుకోవాలి. ఇవన్నీ నిబంధనలు పాటించకుండా మెడలో రుద్రాక్ష ఉంచుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తప్పకుండా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ పరమ శివుడి ఆగ్రహానికి కోపం కోపానికి గురి కావాల్సి ఉంటుందని పెద్దలు అంటున్నారు.