Khairatabad Ganesh: నిల‌బెట్టిన చోటే ఖైర‌తాబాద్ వినాయ‌కుని నిమ‌జ్జ‌నం.. ఎందుకో తెలుసా?

Khairatabad Ganesh: కొన్ని సంవ‌త్స‌రాలుగా ఖైర‌తాబాద్ వినాయ‌కుణ్ణి ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తూ అంద‌రి దృష్టి ఆకర్షించేలా చేస్తారు. గత ఏడాది కరోనా కారణంగా ధన్వంతరి రూపంలో…9 అడుగులకే వినాయకుడు పరిమితమైన విషయం తెలిసిందే. 40 అడుగుల ప్రతిమతో భక్తులను కనువిందు చేయనున్నాడు గణేశుడు. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో ఆక‌ట్టుకునే విధంగా వినాయ‌కుణ్ణి త‌యారు చేస్తున్నారు.

Khairatabad Ganesh Immersion in Same Place from Next Year
Khairatabad Ganesh Immersion in Same Place from Next Year

ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌‌తో చేసిన విగ్రహాలని సాగర్‌లో నిమజ్జనం పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఈసారి నిమజ్జనం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో నిలబెట్టిన చోటే నీటితో నిమజ్జనం చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ ఒక్క సంవత్సరానికి హుసేన్ సాగర్‌లో అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ కేసు విచారణకు రానుంది.

జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.’తనకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలే పెట్టాలని వినాయకుడు కోరుకోలేదు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లోనూ ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్‌ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది.

ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కాలుష్యకాసారంగా తయారైంది.’ అని హైకోర్టు మండిపడింది.