Tirumala Srivari Hundi : స‌రికొత్త రికార్డ్ సృష్టించిన శ్రీవారి హుండీ ఆదాయం.. తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే తొలిసారి..!

NQ Staff - July 5, 2022 / 05:48 PM IST

Tirumala Srivari Hundi : స‌రికొత్త రికార్డ్ సృష్టించిన శ్రీవారి హుండీ ఆదాయం.. తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే తొలిసారి..!

Tirumala Srivari Hundi : క‌లియుగ వైకుంఠ దైవం, వడ్డీకాసుల వాడు తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు మారుమూల ప్రాంతాల నుండి కూడా త‌ర‌లి వ‌స్తుంటార‌నే విష‌యం తెలిసిందే. తిరుమ‌ల నిత్యం భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. శ్రీవారిని ద‌ర్శించుకొని అక్క‌డ మొక్కులు చెల్లించుకుంటే తాము కోరుకున్న‌వి తప్ప‌క తీరుతాయ‌ని భ‌క్తులు భావిస్తుంటారు. ఇక శ్రీవారికి కొంద‌రు భ‌క్తులు చెల్లించే కానుక‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

రికార్డ్ ఆదాయం..

రూపాయి నుండి ల‌క్ష‌ల వ‌ర‌కు హుండీల‌లో కానుక‌గా వేస్తుంటారు. బంగారం, వెండి వంటి న‌గ‌ల‌ను కూడా స్వామి వారికి స‌మ‌ర్పిస్తుంటారు. ఈ క్ర‌మంలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. రికార్డు స్థాయిలో రూ.6కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.6కోట్ల 18 లక్షలుగా టీటీడీ ప్రకటించింది.

Income of Tirumala Srivari Hundi

Income of Tirumala Srivari Hundi

శ్రీవారి హుండీ ఆదాయం ఇలా రూ.6 కోట్లు దాటడం ఇదే తొలిసారి. 2012 ఏప్రిల్ 1 న వచ్చిన రూ.5కోట్ల 73 లక్షల ఆదాయమే ఇప్పటివరకు అత్యధికం. పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. ఆదివారం నాటి విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం రూ.5.73 కోట్లే.

ఆదివారం తిరుమ‌ల వెంక‌న్న‌కు హుండీలో స‌మ‌ర్పించిన ఆదాయాన్ని టీటీడీ సోమ‌వారం లెక్కించింది. ఈ లెక్కింపులో ఆదివారం నాటి విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం రూ.5.73 కోట్లే. ఆ త‌ర్వాత అంత‌కుమించిన ఆదాయం ఇప్ప‌టిదాకా ల‌భించ‌లేదు.

గత రెండు నెలలుగా కూడా నిత్యం నాలుగు కోట్లకు పైబడే ప్రతి రోజూ హుండీ ఆదాయం లభిస్తోంది. ఒక నెలలోనే హుండీ ఆదాయం దాదాపు రూ.120 కోట్లు దాటిన పరిస్థితి తిరుమలలో కనపడింది. ఇక తాజాగా హుండీ ఆదాయం ఒక్కరోజులో రూ.6కోట్లు దాటడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Devotional in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us