Tirumala: తిరుమల చరిత్రలో మొదటిసారి..శ్రీవారికి మే నెలలో భారీ ఆదాయం…

NQ Staff - June 10, 2022 / 09:28 PM IST

Tirumala: తిరుమల చరిత్రలో మొదటిసారి..శ్రీవారికి మే నెలలో భారీ ఆదాయం…

తిరుమల శ్రీవారిని రోజుకి లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులు తీరితే భారీ ఎత్తున కానుకలు సమర్పించుకుంటుంటారు. కొందరు భక్తులు కోట్ల రూపాయల విలువ చేసే కానుకలు ఇస్తారు. మరికొందరు తమకు తోచిన విధంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.

Huge Income for Tirumala in the month of May

Huge Income for Tirumala in the month of May


గత రెండేళ్లుగా కరోనా కారణంగా కొండపైకి సరిగా భక్తులను అనుమతించలేదు. కొవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో తరచూ శ్రీవారిని దర్శించుకునే భక్తులు స్వామి వారి సన్నిధికి రాలేకపోయారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ నిబంధనలు ఎత్తివేసిన టీటీడీ.. భక్తులను పెద్ద సంఖ్యలో దర్శనాలను కల్పించే ఏర్పాట్లు చేసింది.

వేసవికాలం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. క్యూలైన్లు పెద్దగా ఉన్నా కూడా అష్టకష్టాలు పడి స్వామివారిని కనులారా చూసి తరిస్తున్నారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఎక్కడ చూసినా రద్దీ నెలకొంది. అదే స్థాయిలో స్వామివారికి హుండీ ఆదాయం సమకూరుతుంది.

శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీలో కానుకలు అందాయి. మే నెలలో రికార్డు స్థాయిలో రూ. 130 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్క నెలలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి.

మే నెలలో 22.62 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ సర్వదర్శన విధానం మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లను భక్తులకు జారీ చేయనున్నారు.

Read Today's Latest Devotional in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us