మేష రాశి : పనులు చకచకా సాగుతాయి !
ఈరోజు సానుకూలం గా గడుస్తుంది. పనులు చకచకా సాగుతాయి. పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిర్ణయాలు తీసుకునే సమయం లో జాగ్రత్తగా ఉండండి. ఆహ్వానాలు అందుతాయి. కృష్ణ అష్టకం పారాయణం చేసుకోండి.
వృషభ రాశి : ఆలయాలు సందర్శిస్తారు !
ఈరోజు పనుల్లో తొందరపాటు. ఈరోజు మీకు ఆహ్లదకరం గా గడుస్తుంది. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. స్నేహితుడ్ని కలుస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేసుకొండి.
మిధున రాశి : ఉద్యోగాలో ఉత్సాహం !
ఈరోజు ఇతరులకు సాయం చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. కార్యాలయంలో మీకు అనుకూలం గా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి సహోద్యోగుల్లో మార్పులు తీసుకొస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.
కర్కాటక రాశి :పనులను పూర్తి చేస్తారు !
ఈరోజు సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. మీరు తీసుకునే ఆహరం విషయం లో శ్రద్ధ వహించండి. బాధ్యతలు పెరుగుతాయి. షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.
సింహ రాశి: పోటీ పరీక్షల్లో విజయం !
వ్యాపారం కలిసి వస్తుంది. పనులలో విజయం. గతంలో కంటే ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.
కన్య రాశి : సన్నిహితుల సాయం అందుతుంది.
ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. స్నేహితుడిని కలుస్తారు. వాహనయోగం. స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.
తుల రాశి : ఉద్యోగాలలో మార్పులు !
ఈరోజు ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. పనులలో తొందరపాటు. కుటుంబం తో ఆనందం గా గడుపుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. శుభవార్తలు వినే సూచనలు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.
వృశ్చిక రాశి : ఆదాయ వనరులను సృష్టించుకుంటారు !
ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. మీ మాటల వలన మీరు ఎంచుకున్న రంగం లో గౌరవాన్ని పొందుతారు. శ్రమాధిక్యం. ఈరోజు ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.
ధనుస్సు రాశి : ఈరోజు వివాదాలు తీరతాయి !
ఇంటాబయటా ప్రోత్సాహం.ఈరోజు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. మీ బంధువులు, సహోద్యోగుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కోర్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కృతమవుతాయి. వ్యవహారాలలో విజయం. శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.
మకర రాశి : సోదరుల నుంచి శుభవార్తలు !
ఈరోజు వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ పాత స్నేహితులను కలవడం వలన సంతోష పడతారు. సన్నిహితుల సాయం అందుతుంది. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.
కుంభ రాశి : పనులు వాయిదా వేస్తారు !
శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. అత్తగారి ఇంటి వైపు నుంచి చర్చలు జరిగే అవకాశాలుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టేముందు క్షుణ్ణంగా పరిశీలించండి. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.
మీన రాశి : శ్రమాధిక్యం !
కుటుంబసభ్యులతో వివాదాలు.ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. శ్రమాధిక్యం. వాహనాలు నడిపే సమయం లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. లక్ష్మి కుబేర స్తోత్ర పారాయణం చేయండి.