Mani Tailor : పరదాల మణి: శ్రీ వారి సేవలో అరుదైన భాగ్యం ఈయనకు దక్కింది.! ఎవరీ పరదాల మణి.?
NQ Staff - September 20, 2022 / 09:34 PM IST

Mani Tailor : తిరుమల తిరుపతి దేవస్థానంలో ‘పరదాల మణి’ అంటే తెలియని వాళ్లుండరు. ఇంతకీ ఈ పరదాల మణి ఏం చేస్తారు.? పరదాలు కుడుతూ వుంటారు. ఏం పరదాలు.? శ్రీ వారి ముందు వేలాడే పరదాలు, కురాలాలను స్వయంగా తన హస్తాలతో కుట్టి ఇస్తారు పరదాల మణి.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే తిరుమంజనం ఆళ్వార్ నాడు టైలర్ మణి, శ్రీవారికి పరదాలూ, కురాలాలూ కుట్టి సమర్పిస్తుంటారు. గత 24 ఏళ్లుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని నెరవేర్చే భాగ్యం తనకు దక్కినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు పరదాల మణి.
తిరుమలలోని తీర్ధ కట్ట వీధిలో సాధారణ టైలర్‌గా జీవనం సాగించే టైలర్ మణికి పరదాల తయారీలో అద్భుతమైన కళ నైపుణ్యం వుంది. 1999లో పద్మావతీ ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని కుట్టి ఇచ్చారు.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
పరదాల మణి ఏం చేస్తాడంటే.!
ఇక అప్పటి నుంచీ శ్రీ వారి గర్భాలయంలో వేలాడే పరదాలు, కురాలాలూ కుట్టేందుకు ఆదేశాలు రావడంతో, గత 24 ఏళ్లుగా ఇక స్వామి వారి సేవలోనే తరిస్తున్నాననీ ఇటీవల మణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం తర్వాత శ్రీవారికి పట్టు పరదాలు, కురాలాలూ సమర్పిస్తుండడం గత 24 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
మూడు రకాల పరదాలూ, రెండు రకాల కురాలాలూ ప్రతి ఏటా నాలుగు సార్లు సమర్పిస్తారట.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
స్వామి వారి గర్భాలయాన్ని ఆనుకుని వున్న కులశేఖర పడికీ, రాముల వారి మేడకు, జయ విజయ ద్వార పాలకులకు మూడు పరదాలూ, స్వామి వారికి మరో రెండు కురాలాలూ సమర్పిస్తారట.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనానికి ముందు వచ్చే సోమవారం నాటికి, నెల రోజులు దీక్ష చేసి, ఆ దీక్షలోనే పరదాలను సిద్ధం చేసి, అనంతరం కాలిబాటన తిరుమల చేరుకుని, పవిత్ర పుష్కరణిలో స్నానం ఆచరించి వరాహ స్వామిని దర్శనం చేసుకుంటారట మణి.

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari
అలా మంగళవారం నాడు జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నాడు స్వామి వారికి పరదాలను, కురాలాలను సమర్పిస్తారట. ఆహా.! పరదాల మణిది ఎంత మహాభాగ్యమో కదా.!

He Got Rare Fortune In Service of Mani Tailor Shri Vaari