Srikalahasteeswara temple : శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీ భక్తుల రాహు కేతు పూజలు
NQ Staff - December 12, 2022 / 04:28 PM IST

Srikalahasteeswara temple : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి విదేశీ భక్తులు పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి దేవాలయంలో పూజలు నిర్వహించడంతో చర్చనీయంశమైంది.
బ్రెజిల్ నుండి వచ్చిన 22 మంది భక్తులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెజిల్ భక్తులతో పాటు స్థానిక భక్తులు మరియు అధికారులు ఈ రాహు కేతు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ అధికారులు పేర్కొన్నారు.
ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించుకుని ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడం తమకు దక్కిన అదృష్టం అంటూ బ్రెజిల్ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తమకి ఇక్కడ లభించిన ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉంది అంటూ వారి పేర్కొన్నారు.
రాహు కేతు పూజల నిర్వహణకు దేశంలో శ్రీకాళహస్తి తప్ప మరో మంచి ప్రదేశం దేవాలయం లేదు అంటూ పెద్దలు చెబుతున్నారు. విదేశీ భక్తులు ఇలా స్వామి వారి ఆలయంలో రాహు కేతు పూజలకు హాజరవ్వడం.. అది కూడా పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో స్థానికంగా చర్చనీయాశం అయింది.