Viral News : తాయెత్తు వెనుక మిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
NQ Staff - September 18, 2022 / 09:40 AM IST

Viral News : మామూలు జ్వారానికి సైతం కొందరు మంత్రగాళ్ళను ఆశ్రయిస్తుంటారు. ఏదో తాయెత్తు కట్టేస్తాడా మంత్రగాడు. అక్కడితో జ్వరం తగ్గిపోయిందని అనుకుంటుంటారు అమాయకులు. నిజానికి, సాధారణ జ్వరం వచ్చినట్లే వచ్చి తగ్గిపోతుంది. కానీ, తగ్గిపోవడం వెనుక తాయెత్తు మహిమ అనే భ్రమల్లో వుంటారు అమాయక జనం.

Do you the Amulet back story
దీన్ని క్యాష్ చేసుకోవడానికి మంత్రగాళ్ళు చిత్ర విచిత్రమైన వేషాలేస్తారు. రాగి తాయెత్తు.. వెండి తాయెత్తు.. బంగారు తాయెత్తు.. ఇలా మంత్రగాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే వుంది ఈ ఆధునిక యుగంలో.
అసలు తాయెత్తు అంటే ఏంటి.? నిజానికి, తాయెత్తుకి అసలు అర్థం వేరే వుంది. థాయి అంటే అమ్మ.. యత్ అంటే ఖండించడం.. ‘పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ..’ అంటుంటాం కదా.! ఆ పేగులోని ముక్క అన్నమాట.
ఆ ముక్కని ఒకప్పుడు చంటి పిల్లల మొలత్రాడుకి కట్టేవారు. అదే సకల అరిష్టాల్నీ తగ్గిస్తుందని బలంగా నమ్మేవారు.
ఇప్పుడు, ఈ ఆధునిక యుగంలో అలా భద్రపరచిన బొడ్డు తాడుకి ఎంతో విలువ వుంది. దాన్ని క్రయోజినిక్ పద్ధతిలో గనుక దాచుకుంటే, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకినప్పుడు.. ఆ బొడ్డు తాడు నుంచి వచ్చే మూలకాలతోనే నయం చేయడానికి వీలవుతుంది.
ఇదీ తాయెత్తు వెనుక అసలు కథ. ఇప్పుడర్థమయ్యింది కదా.. మన పూర్వీకులు ఏం చేసినా, అందులో సైన్స్ వుంటుందని. జస్ట్ మూఢ నమ్మకమని కొట్టి పారేసేవాళ్ళు.. అసలు విషయాల్ని తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే.