CM KCR : సీఎం కేసీఆర్ సంగతి పక్కన పెట్టి.. నువ్వైనా చెయ్యొచ్చుగా శ్రీ‘‘రఘునందనా’’..

CM KCR : సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆరెస్ ని అనూహ్యంగా ఓడించిన బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న(సోమవారం) ఒక మాటన్నాడు. సీఎం కేసీఆర్ ఆయన దృష్టిలో ఒక సన్నాసి అట. పాపం. ఒకప్పుడు ఇదే గులాబీ పార్టీలో ఉన్న రఘునందన్ రావు తన బాసు(కేసీఆర్) కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడానికి వాడిన ఈ ‘తెలుగు’ భాషనే అక్షరం పొల్లు పోకుండా నేర్చుకున్నట్లున్నాడు. ఇప్పుడు అచ్చం అవే మాటలను అదే కేసీఆర్ పైన ప్రయోగిస్తున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తప్ప మరే ప్రయోజనాల్నీ ఆశించని కేసీఆర్ హస్తం పార్టీ నేతలను అడ్డదిడ్డంగా కడిగిపారేసిన మాట వాస్తవమే. కానీ ఆయన ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు. మరి, ప్రస్తుతం ఆ కేసీఆర్ పైన నోరు పారేసుకుంటున్న రఘునందన్ రావు ఏం చేస్తానంటున్నాడో చూద్దామా..

చేతకాదంటేనే..

భద్రాద్రిలోని సీతారామచంద్ర స్వామి ఆలయం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ఇస్తానని ఏడేళ్ల కిందట చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రఘునందన్ రావు అదే భద్రాద్రిలో భగ్గున మండిపడ్డాడు. ‘‘అంత డబ్బు ఇవ్వటం నాకు చేతకాదు’’ అని సీఎం ఒప్పుకుంటే నెల రోజుల్లోనే ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తాను తీసుకొస్తానని డమ్మీ హామీ ఇచ్చాడు. అయితే ఇక్కడ రఘునందన్ రావు చిన్న లాజిక్ మిస్సయ్యాడనిపిస్తోంది. ఏడేళ్లయినా కేసీఆర్ ఏమీ చేయలేకపోయాడు కాబట్టి ఆ పనేదో నేను చేస్తాను చూడండి అని ప్రకటించి ఉంటే బాగుండేది. తద్వారా తన కమలం పార్టీ హిందుత్వ అజెండాను, క్రెడిట్ ని కొట్టేసేవాడు. ఎప్పుడూ ఏదో ఒక యాగం, పూజ చేసే ముఖ్యమంత్రి భద్రాద్రికే కాదు అయోధ్య రామాలయానికి కూడా అణా పైసా ఇవ్వలేదని విమర్శించి ఉంటే ఇంకా బాగుండేది. కానీ రఘునందన్ రావు అలా స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు?. కేంద్రం నుంచి వంద కోట్లు తెచ్చే సీన్ ఆయనకు కూడా లేదా అనే అనుమానం కలుగుతోంది.

CM KCR : don't consider cm kcr.. you do alone
CM KCR : don’t consider cm kcr.. you do alone

రామదాసు గుర్తొచ్చాడా?: CM KCR

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావటం గ్యారంటీ అంటున్న రఘునందన్ రావు ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు ఆ వంద కోట్లు తెచ్చి భద్రాద్రి గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని రామభక్తులు కోరుతున్నారు. అలా చేసిన పక్షంలో ఆ దేవుడి దీవెనలు మరింతగా లభించి వచ్చే ఎలక్షన్లలో కాషాయం జెండాని గోల్కొండపైన ఎగరేస్తారని సూచిస్తున్నారు. రాముడి ఆశీస్సులు లేకపోయినా పవర్ లోకి వచ్చితీరతామనుకుంటే ఛోడ్ దో అంటున్నారు. అయితే.. ‘‘శ్రీరఘునందనుడైన ఆ సీతారమణకి గుడి కట్టిన శ్రీరామదాసు ఏం బాగుపడ్డాడు. ఈ గోల్కొండలోనే కదా కారాగారం అనుభవించాడు’’ అనే సంగతి గుర్తొచ్చి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగిపోయాడా అని టీఆరెస్ పార్టీవాళ్లు సరదాగా ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement