Lord Shani : శని దేవుడి హారతితో మీ ఆర్థిక కష్టాలన్నింటికి చెక్
NQ Staff - December 12, 2022 / 04:43 PM IST

Lord Shani : హిందూ పురాణాల ప్రకారం శని దేవుడు అత్యంత ప్రభావవంతుడు. ఆయన ప్రభావం ఉన్న రాజు కూడా అష్ట కష్టాలు పడ్డట్లుగా చెబుతూ ఉంటారు. సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో శని దేవుడి యొక్క ఆగ్రహానికి ప్రభావానికి గురి కావ్వాల్సిందే.
శని దేవుడి ప్రభావం ఉన్న సమయం లో జీవితం లో అంతా చెడు జరుగుతూ ఉంటుంది. అందుకే శని దేవుడు యొక్క ప్రభావం తగ్గించుకునేందుకు, తీవ్ర ఆర్థిక నష్టాలు తొలగించుకునేందుకు శని దేవుడి ని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకోసం శని దేవుడికి హారతి ఇవ్వాలని పెద్దలు చెప్తూ ఉంటారు. శని చెడు ప్రభావం నుండి సులభంగా బయట పడవచ్చు. అందుకు గాను శని దేవుని ముందు ఆవు నెయ్యి తో దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.
శని దేవుని యొక్క పూజను భక్తి శ్రద్దలతో నిర్వహించాలి. ఆవు నెయ్యిని ఉపయోగించి శని దేవునికి హారతి ఇవ్వడం వల్ల కచ్చితంగా తమ కుటుంబం పై ఉన్న శని ప్రభావం తొలగిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా శని దేవుడిని తక్కువ చూడకుండా హారతి ఇవ్వాలంటూ పెద్దలు చెప్తున్నారు.