Connect with us

Health

డిప్యూటీ స్పీకర్ కు కరోనా పాజిటివ్

Published

on

Share the News from here

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఒకవైపు ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాజేంద్ర రాథోడ్ కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా, పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఇప్పటికే నాలుగైదు సార్లు టెస్టులు చేయించుకున్నాడు రాజేంద్ర రాథోడ్. ఇక ఈ రోజు కూడా టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది.

అలాగే తనకు కలిసిన వారందరు కూడా టెస్టులు చేయించుకోవాలి అని సూచిస్తూ.. ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఇక రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 83,853కు చేరుకుంది. దింట్లో 14,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా బారిన పడి 1,074 మంది మృతి చెందారు.

Do NOT follow this link or you will be banned from the site!