Connect with us

Latest News

కరోనా దెబ్బకు కూరగాయలు అమ్ముతున్న చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ డైరెక్టర్

Published

on

Share the News from here

కరోనా చాలామంది బతుకులను రోడ్డు మీదకు లాగింది. అయితే లాక్ డౌన్ సమయంలో సామాన్యులనుండి వ్యాపారవేత్తల వరకు చాలామంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇది ఇలా ఉంటె లాక్ డౌన్ దెబ్బకు ఓ టీవీ సీరియల్ డైరెక్టర్ కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అయితే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ అందరికి తెలిసిందే. ఇక హిందీలో సూపర్ హిట్ అయిన బాలికా వధు సీరియల్ ని తెలుగులో చిన్నారి పెళ్ళికూతురుగా అనువాదం చేసారు. ఇక ఈ సీరియల్ లో నటించిన బాల నటి అవికాగోర్ ఆ తరువాత ఉయ్యాలా జంపాలా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.

కానీ ఈ సీరియల్ దర్శకుడు ప్రస్తుతం కూరగాయలు అమ్ముకుంటున్నాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా సినిమాలు లేకపోవడంతో దర్శకుడు రామ్ వ్రిక్షా గౌర్ తన స్వంత గ్రామంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఆ దర్శకుడు స్పందిస్తూ.. ఒక సినిమా కోసం తన సొంత గ్రామానికి వచ్చానని, ఇంతలోనే లాక్ డౌన్ విధించారని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న సినిమా నిర్మాత, నిర్మాణ పనులని వచ్చే ఏడాదికి వాయిదా వేసాడట. దీనితో ఆయనకు పనిలేకుండా పోయింది. ఇక ఊర్లో ఉన్న వాళ్ల నాన్నగారి కూరగాయల వ్యాపారాన్ని చూసుకుంటున్నాను అని తెలిపాడు.

Do NOT follow this link or you will be banned from the site!