Connect with us

Latest News

మరో కాంగ్రెస్ గా మారనున్న టీడీపీ, కంగారులో చంద్రబాబు

Published

on

Share the News from here

ఈ రంగంలోనైనా ముందు వెళ్తున్న వారితో, ముందున్న వారితో పోటీ పడటం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ పంథా వేరే దిశగా సాగుతుంది. పతనావస్థకు చేరువలో ఉన్న టీడీపీ ఇప్పుడు పతనమైపోయిన కాంగ్రెస్ తో పోటీ పడుతుంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పతనమైపోయింది. అలాగే రాష్ట్ర విభజన సమయంలో స్థిరమైన నిర్ణయం తీసుకోలేని టీడీపీ కూడా తెలంగాణలో పతనమైంది. ఇలా పతనం అవ్వడంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

అయితే ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ పూర్తిగా పతనం అయ్యే సమయం చేరువలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీడీపీ వాటిని కూడా నిలుపుకోలేకపోయింది. 23 కాస్త ఇప్పుడు 19గా మారాయి. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి వీడ్కోలు పలికితే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతారు. రాష్ట్ర విభజన తరువాత ఎలాగైతే కాంగ్రెస్ తరుపున 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవ్వరు ఎలాగైతే ముందు రాలేదో అలాగే 2024 ఎన్నికల సమయానికి టీడీపీ నుండి కూడా పోటీ చేయడానికి నాయకులు ఉండరని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం జమిలి ఎన్నికలు వస్తే తమదే విజయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Do NOT follow this link or you will be banned from the site!